నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో బాంబ్ పెట్టినట్లుగా పేక్ కాల్ చేసిన యువకుడి పోలీసులు పట్టుకున్నారు.
ఈ నెల 2న రాత్రి బాంబు పెట్టినట్లు డయల్ 100 కాల్ వచింది వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తన యొక్క సిబ్బందితో హుటాహుటిన డాగ్ స్క్వాడ్ మరియు బిడి టీం సహాయంతో పూర్తిగా రైల్వే స్టేషన్ లో అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా గాలించి పరిశీలించి బాంబు లేక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు
బాంబు పెట్టినట్లు ఫేక్ డయల్ 100 కి కాల్ చేసింది , కీసర మండలం అంకిరెడ్డి పల్లి, గ్రామానికి చెందిన శ్రీమంత్ గౌడ్గా గుర్తించారు పర్సనల్ సమస్యలతో, ప్రజల్లో భయాందోళన గురిచేసి హింసను ప్రేరేపించాలని దురుద్దేశంతో ఫోన్ కాల్ చేశానని విచారణ లో పేర్కొన్నారు .న్యాయస్థానం ముందు హాజరు పరిచి రిమాండ్ కుపంపారు
