HomeLaw and Orderవ్యాపారాల నిర్వహణ గడువు గంట పెంచండి ......సీపీ ని కోరిన యంఐయం నేతలు

వ్యాపారాల నిర్వహణ గడువు గంట పెంచండి ……సీపీ ని కోరిన యంఐయం నేతలు

నగరంలో వ్యాపారలావాదేవీల నిర్వహణ లో ఆంక్షలు సడలించాలని యంఐయం నేతలు కోరారు. ఇంచార్జ్ ఎమ్మెల్యే అహ్మద్ బాలల సూచన మేరకు జిల్లా నగర అధ్యక్షులు ఫయాజ్ షకీల్ లు సోమవారం నగర పోలీసు కమిషనర్ సాయి చైతన్య ను కలిశారు.

ప్రస్తుతం నగరంలో వ్యాపార సముదాయాలను రాత్రి పదిన్నర గంటలకే మూసేయిస్తున్నారని కనీసం మరో గంట అంటే 11 న్నర దాక దుకాణాలు తెరిచి ఉండేలా చూడాలని వారు కోరారు

ప్రజలకు వ్యాపారులకు సౌకర్యంగా వుంటుందని ఇరుపక్షాలు కూడా శాంతి భద్రతల నిర్వహణలో పోలీసులకు పూర్తిస్థాయి లో సహకారం అందిస్తారని వారు భరోసా ఇచ్చారు యంఐయం నేతల వినతి ని సీపీ సానుకూలంగా స్పందించారు

సంబంధిత అధికారులతో మాట్లాడి అధికారికంగా ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments