జాన రమేష్ : ఇది సంగతి: ఆర్మూర్:
విద్యుత్ సరఫరాలలో అంతరాయాన్ని నిరసిస్తూ కమ్మర్పల్లిలో రైతులు సబ్ స్టేషన్ లో ముట్టడించారు. పంటలకు సాగునీరు అందించడంతోపాటు గ్రామంలో వేలపాళ లేకుండా కరెంటు కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తులైన కమ్మర్ పల్లి వాసులు విద్యుత్ అధికారులను నిలదిసేందుకు సబ్ స్టేషన్ కు తరలి వచ్చారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలో తరచుగ విద్యుత్తు సరఫరా అంతరాయం జరుగుతుండముతో రైతులు,గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. సబ్ స్టేషన్ వద్దకు వచ్చిన రైతులు ఎలక్ట్రిసిటీ అధికారులను నిలదీశారు. సంఘటన స్థలానికి డిఇ రావాలనీ తరచూ విద్యుత్తు సరఫరా అంతరాయం కాకుండ చూడాలని డిఇ వచ్చి స్పష్టమైన హామి ఇచ్చే వరకు ఆందోళన విరమించమని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు…కమ్మర్ పల్లిలో గ్రామస్తుల నిరసన… సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన…స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ
RELATED ARTICLES
