నిజామాబాద్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన వెలుగు చూసింది. కన్న తండ్రే సొంత కూతురిపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఇటీవల అర్ధరాత్రి కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడగా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
