ఈ కారు ఫార్ములా రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసుకునేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు.
ఈ మేరకు సెప్టెంబర్ 9న రాజ్‌భవన్‌కు ఏసీబీ ఫైలు పంపగా, రాష్ట్రపతి కార్యాలయం నుంచి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ బుధవారం గురువారం ఉదయం కేటీఆర్‌పై విచారణకు అనుమతినిస్తున్నట్లుగా ఫైలుపై సంతకం చేశారు.
ఈ తాజాగా పరిణామంతో కేటీఆర్‌తో పాటు మాజీ హెచ్ యం డి చీఫ్ ఇంజినీర్ (ప్రాజెక్ట్స్) బీఎల్వీ రెడ్డి, మాజీ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్‌లపై ఏసీబీ త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది.
