అల్లరి ముద్దు గా పెరిగిన తనయుడు తనువు చాలించడంతో ఆ తండ్రి గుండె తట్టుకోలేక పోయింది అదే వేదనతో ఉన్న తండ్రి గుండె ఆగిపోయింది :
బోధన్ మండలం బెల్లాల్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది గ్రామానికి చెందిన దేవర్ల సాయికుమార్(22) అనే యువకుడు కందకుర్తి గోదావరి నదిలో ప్రమాదవశాత్తు మునిగి మరణించాడు 4 రోజులు గడవక ముందే మృతుడి తండ్రి దేవర్ల వెంకటేష్(54) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు.
నాలుగు రోజుల్లోనే తండ్రి కొడుకులు చనిపోవడంతో గ్రామస్తులను చలించిపోతున్నారు. సాయికుమార్ ఈనెల 18వ తేదీన ఆయన స్నేహితుడు ఉదయ్ కుమార్ తో కందకుర్తి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెళ్లారు.
ఆ క్రమంలో నదిలోకి ఉదయ్ కుమార్ వెళ్లి ఈత కొడుతున్నాడు.సాయికుమార్ నదిలోకి దిగాడు.సాయి కుమార్ కు ఈత రాదు.లోపలికి వెళ్లిన సాయికుమార్ నీటిలో మునిగాడు.
ఆయన స్నేహితుడు ఉదయ్ కుమార్ నీటిలో మునుగుతున్న సాయికుమార్ ని చూసి ఈత కొట్టుకుంటా వెళ్ళాడు.అయినప్పటికీ సాయికుమార్ ని కాపాడలేకపోవడంతో సాయికుమార్ నదిలో మునిగి మృతి చెందాడు.
సాయికుమార్ మరణం తట్టుకోలేక సాయి కుమార్ తండ్రి వెంకటేష్ నిదురలు లేని రాత్రులు గడిపాడు.గురువారం ఉదయం 3 గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.