HomeEditorial Specialఅడ్రస్ లేని మాజీలు .....సంస్థాగత ప్రక్షాళన లేనట్లేనా .....గులాబీ .క్యాడర్ లో కనిపించని జోష్ .......

అడ్రస్ లేని మాజీలు …..సంస్థాగత ప్రక్షాళన లేనట్లేనా …..గులాబీ .క్యాడర్ లో కనిపించని జోష్ …….

రజతోత్సవం సంబరాలకు సిద్ధం అవుతున్న బిఆర్ యస్ ఇంకా సంస్థా గత వైఫల్యాలను అధిగమించలేక పోతుంది. ఇంకా అధికారం కోల్పయిన షాక్ లో కొట్టుమిట్టాడుతోంది.ప్రభుత్వ వైఫల్యాల ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే కార్యాచరణఫై కనీస ఆసక్తి చూపలేక పోతుంది.

అధినేత తరహాలోనే మాజీ ఎమ్మెల్యే లు సైతం నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడడం లేదు. పార్టీ ఏర్పాటు చేసి 25 ఏళ్ల పూర్తీ అవుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ సంబరాలు పెద్దఎత్తున చేయాలనీ భావిస్తున్న ఆ పార్టీ కనీసం జిల్లాలో పార్టీ నిర్మాణ వ్యవస్థ ను బలోపేతం చేయడానికి ఇష్ట పడడం లేదు.

ఇంకా ఓడిన నేతలే సెగ్మెంట్ లకు పార్టీ సుప్రీం లాగనే పెత్తనం సాగిస్తున్నారు. పదేళ్ల పాటు నియోజకవర్గాల్లో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన నేతలు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. డీలా పడ్డ క్యాడర్ ను భుజం తట్టే నాథుడే లేకుండా పోయారు.

గత పదేళ్లుగా ఆపార్టీకి పూర్తీ స్థాయి జిల్లా కార్యవర్గమే లేదు.ఎలాగో అధికారంలో ఉన్న పదేళ్ల కాలం లో పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టని పార్టీ పెద్దల్లో కనీసం ఇప్పుడు కూడా ఆ సోయి కనిపించడంలేదు.అధికారం కోల్పోయాక పార్టీలో దిద్దుబాటు చర్యలుంటాయని భావించారు కానీ ఏడాదిన్నారు అవుతున్న ఇంకా అదే కాలక్షేపం సాగుతుంది.

అసెంబ్లీ ఎన్నికలు ముందు జిల్లా అధ్యక్షుడి గా ఆర్మూర్ ఎమ్మెల్యే గా ఉన్న జీవన్ రెడ్డి నియమించారు. కానీ మిగితా కార్యవర్గమే నియామకం చేయలేదు.దీనితో జీవన్ రెడ్డి పూర్తీ గా సెగ్మెంట్ కే పరిమితం అయ్యారు మిగితా సమయం అధినేత ను అనుసరించడం లో పోయింది దీనితో ఆయన రోజుల తరబడిగా జిల్లా ఆఫీస్ వైపు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి ఉండే. అసలు ఎమ్మెల్యే లను ఆయా సెగ్మెంట్ లలో జిల్లా అధ్యక్షుడు పార్టీ ని బలోపేతం చేసే పరిస్థితి లేకుండే.

అందుకే పార్టీకి కోసం క్రియాశీలకంగా పనిచేసే వారే లేకుండా పోయారు అంతా ఎమ్మెల్యే భజన బృందంగా మారిపోయారు.ఎమ్మెల్యే అధికార మత్తు లో ఉండిపోవడంతో వారూ పార్టీ బలోపేతం కన్న సొంత ఇమేజ్ మీదే ఫోకస్ పెట్టారు. పార్టీలో ప్రభుత్వ వ్యవహారాల్లో ఏది జరిగినా తమ కను సైరాల్లో జరిగేలా చేసుకున్నారు.

ఎమ్మెల్యే కాకుండా తనయులో …తమ్ముళ్ళో పెత్తనం కూడా మొదలు పెట్టారు అదే పార్టీ కి శరాఘాతం అయింది. పార్టీ లో వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతల్లో ఉన్న ఉన్న కేటీఆర్ కూడా ప్రభుత్వ వ్యవహారాల్లోనే తీరిక లేకుండా ఉండడం తో పార్టీ ని జిల్లాలో బలోపేతం చేసే నాథుడే లేకుండా పోయారు. అందుకే క్యాడర్ సైతం పార్టీలో చురుకు గా పనిచేయడం వదిలేసారు.

కానీ అధికారం కోల్పోయాక ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజాక్షేత్రంలో వెళ్ళడానికి చురుకైన క్యాడర్ కోసం పార్టీ దిక్కులు చూడాల్సి వస్తుంది. పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ఎమ్మెల్యే ల కొటారి గా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. అందుకే నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేవెంట పట్టు మని పది మంది కూడా ఉండని పరిస్థితి వచ్చింది. అసలు ఓడిపోయాక మాజీ సెగ్మెంట్ లకు ఎందుకు మొఖం చాటేశారనేది ఎవ్వరికి అంతు చిక్కడం లేదు.

ఎమ్మెల్యే లుగా గెలిచిన వారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ సంగతి అడిగే వారే లేకుండా పోయారు. ఎంపీ ఎన్నికలో కనీసం పోటీ ఇవ్వలేక పోవడం తో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా వుండడంతో జిల్లాలో పార్టీ మరింత బలహీనంగా మారింది.

సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా చెయ్యాలని భావిస్తున్న పార్టీ జిల్లా స్థాయిలోనూ పార్టీ ని బలోపేతం చేస్తే క్యాడర్ లోనూ ఉత్తేజం వచ్చే ఛాన్స్ వుంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments