అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తో నియోజకవర్గాలకు మొఖం చాటేసిన మాజీ ఎమ్మెల్యే లు మరోసారి రంగంలోకి దిగడానికి సిద్ధం అవుతున్నారు.
ఎమ్మెల్సీ కవిత సైతం జిల్లాలో ఎంట్రీ ఇవ్వడంతో నిన్నటి దాక నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడని మాజీ లు మరోసారి క్రియాశీలం కావడానికి వ్యూహరచన చేస్తున్నారు.
అసలే పట్టనట్లుగా వుంటే నియోజకవర్గ పెత్తనం మరోకరి చేతికి వెళ్లే పరిస్థితి ఉండడంతో మాజీలు జాగ్రత. పడుతున్నారు.ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి బిఆర్ యస్ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డె ఆలోచనలో ఉంది.అధికారం కోల్పోయాక పార్టీకి కలిసొచ్చిన వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది.
పార్టీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఈ సభ సూపర్ హిట్ చేయడం ఆ పార్టీకి అనివార్యంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలు క్షేత్ర స్థాయిలో పార్టీ కి సానుకూలత వ్యక్తం అవుతుంది. అందుకే ఈ సభ తర్వాత అధినేత కెసిఆర్ సైతం మరోసారి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టేలా కార్యాచరణ సిద్ధం అవుతుంది.
అందుకే ఈ సభ కు భారీఎత్తున ప్రజలను తరలించే విధంగా బిఆర్ యస్ నాయకత్వం సన్నాహాలు చేస్తుంది. ఈపాటికే జిల్లాల వారీగా నేతలతో కెసిఆర్ భేటీ అయ్యారు. జనసమీకణ ఎలా చెయ్యాలి ఏ జిల్లా నుంచి ఎంత మంది ని తరలించాలనేది దిశానిర్దేశం చేసారు.
ఈ భేటీ తర్వాత నియోజకవర్గ ఇంచార్జి లుగా చెలామణి అవుతున్న మాజీ ఎమ్మెల్యే లు హైదారాబాద్ ను వదిలి నియోజకవర్గాలకు ఎంట్రీ ఇస్తున్నారు మరోసారి క్యాడర్ ను లీడర్లను చేరదీస్తున్నారు.
పార్టీ ఆదేశాల మేరకు వరంగల్ సభ కోసం నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు మొదలు పెట్టారు.ఇందుకోసం ఎమ్మెల్సీ కవిత సైతం రంగంలోకి దిగారు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి తో కలసి బాన్స్ వాడ సెగ్మెంట్ లో క్యాడర్ ను గట్టిగా కదిలించే పనిలో ఉన్నారు.
జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఎట్టకేలకు ఆర్మూర్ లో మకాం వేశారు నియోజకవర్గ సన్నాహక సమావేశం సక్సెస్ చేశారు. ఆయన ఈ భేటీ లో క్యాడర్ లో ఉత్తేజం కలిగేలా బీజేపీ కాంగ్రెస్ నేతల మీద తీవ్ర స్థాయిలో చెలరేగారు.
మునుపటి దూకుడు తో సహజంగానే క్యాడర్ ఉత్సహం ఉరకలేసింది.ఇప్పటికే అధికార పార్టీ తనను టార్గెట్ చేసినా సరే జీవన్ రెడ్డి తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
మరో వైపు ఎమ్మెల్యే గా గెలిచిన సైలెంట్ గా వుంటూ వస్తున్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం వరంగల్ సభ కు ప్రజలను తరలించే కార్యం లో ఉన్నారు.
వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అయిన మరో సీనియర్ నేత బాజిరెడ్డి కూడా రంగంలోకి దిగారు తాను ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ తో పాటు అధినేత ఆదేశాల మేరకు బాన్స్ వాడ మీద సైతం ఓ కన్నేశారు.
అలాగే బలమైన మైనార్టీ నేత మాజీ ఎమ్మెల్యే షకీల్ తల్లీ మృతి బాధ లో ఉన్నారు అయినప్పటికి ఆయన వరంగల్ సభ కోసం సన్నాహాలు మొదలు పెట్టారు దాదాపు ఏడాదిన్నర తర్వాత బోధన్ లో అడుగు పెట్టిన షకీల్ అధికార పార్టీ నుంచి తలెత్తే ఇబ్బందులను సైతం న్యాయ పరంగానే ఎదుర్కునే ఆలోచనలో ఉన్నారు.ఇక నుంచి పూర్తీ స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా చేరికల కే తెర తీశారు. ఆయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నిరాశ చెందారు.
పూర్తీ గా హైదారాబాద్ కు పరిమితం అయ్యారు. కానీ వరంగల్ సభ కోసం భారీఎత్తున క్యాడర్ ను సమీకరించే పనిలో నిమగ్నం అయ్యారు.మొత్తంగా బిఆర్ యస్ వజ్రోత్సవాలు నేపథ్యంలో పార్టీ యంత్రాంగం మరోసారి యాక్టివ్ అయింది.
హైదారాబాద్ కు పరిమితం అయినా మాజీ ఎమ్మెల్యే లు సైతం నియోజకవర్గాల దారి పట్టారు.