HomeCRIMEనకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు విక్రయించే ముఠా గుట్టురట్టు..ముఠా నుంచి 91 నకిలీ పత్రాలు స్వాధీనం..ఇద్దరు...

నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు విక్రయించే ముఠా గుట్టురట్టు..ముఠా నుంచి 91 నకిలీ పత్రాలు స్వాధీనం..ఇద్దరు అరెస్ట్..ఒకరు పరారీ..

చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే నిరుపేదలకు నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును బీదర్ పుర, టాస్క్ఫోర్స్ పోలీసులు కలిసి రట్టు చేశారు. ఇందులో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ఒకరు పరారీ అయ్యారు.

వారి నుంచి 91 నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే.. విశ్వసనీయ సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు చంచల్‌గూడ కొత్త రోడ్డు నుండి యాకుత్‌పురా వైపు ఎ-2 ద్విచక్ర వాహనం నెంబర్ టీఎస్11ఈబీ7827 వెళ్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు.

వారిని విచారణ చేపట్టగా అబ్దుల్ ఖదీర్,మొహమ్మద్ షకీల్,సంజయ్ శర్మ ముగ్గురు వ్యక్తులు కలిసి యాకుత్‌పురా తదితర ప్రాంతాల్లో ఎలాంటి విద్యార్హతలు లేని వారికి నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలు అందించి విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల పేరుతో వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్ కు చెందిన అబ్దుల్ ఖదీర్‌కు ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ చెందిన సంజయ్ శర్మ పరిచయం ఏర్పడింది.

వారు నిరుపేద విద్యార్థులు ఆశించిన వారి వివరాలు మరియు మొత్తాలను సేకరించి, వాట్సాప్ ద్వారా సంజయ్ శర్మ @సాహిల్ శర్మకు పంపేవారు. తరువాత సంజయ్ శర్మ @ సాహిల్ శర్మ అబ్దుల్ ఖదీర్‌కు కొరియర్ ద్వారా పంపడానికి అవసరమైన సర్టిఫికేట్‌లు మరియు హార్డ్ కాపీలను సిద్ధం చేస్తారు. ఆ తరవాత నకిలీ విద్యార్హత సర్టిఫికేట్లను బాధిత విద్యార్థులకు విక్రయిస్తున్నారు.

నిందితుల నుంచి కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన 43 నకిలీ ధృవపత్రాలు,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయనికి చెందిన 23 నకిలీ ధృవపత్రాలు, ఉస్మానియా యూనివర్సిటీ 08 నకిలీ సర్టిఫికెట్లు,10 నేషనల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ & సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క నకిలీ సర్టిఫికెట్లు, 02 అన్నామలై విశ్వవిద్యాలయం యొక్క నకిలీ సర్టిఫికెట్లు,05 వివిధ విశ్వవిద్యలయాలకు చెందిన మొత్తం 91 నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా అమెరికా, యూకేలో విదేశీ చదువుల పేరుతో వినియోగదారులకు భద్రత కల్పిస్తూ నకిలీ విద్యా సర్టిఫికేట్లు అందించి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు.కాగా అమెరికా, యూకేలో విదేశీ చదువుల పేరుతో వినియోగదారులకు భద్రత కల్పిస్తూ నకిలీ విద్యా సర్టిఫికేట్లు అందించి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు.

వచ్చిన సొమ్మును వాటాల పద్దతిలో పంచుకుంటారు. ఇది ఇలా ఉంటే ఎలాంటి పరీక్షలు లేకుండా యూనివర్సిటీలు, కాలేజ్ ల వెనుక డోర్ నుంచి నకిలీ విద్యాధృవీకరణ పత్రాలను అందజేస్తామని మభ్యపెట్టే అంతరాష్ట్రాల ఏజెంట్లను నమ్మవద్దని, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు..

ఈ విచారణ నాగన్న, సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పిఎస్ డబీర్‌పురా, హైదరాబాద్ మరియుటాస్క్ ఫోర్స్ టీమ్, సౌత్ ఈస్ట్ జోన్ పోలిసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments