సిగ్నలింగ్, ఇంజనీరింగ్ అంశాలు మరియు స్టేషన్ భద్రతకు సంబంధించిన వస్తువుల లభ్యత, పనితీరుపై దృష్టి సారించి క్షేత్రస్థాయి తనిఖీలను చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుదవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు.
రైళ్లను సురక్షితంగా నడపడానికి భద్రతా సంబంధిత అన్ని రిజిస్టర్లు మరియు రికార్డులను నిబంధనల ప్రకారం నిర్వహించాలని మరియు సురక్షితమైన పని పద్ధతులను అనుసరించాలని ఆయన క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
అలాగే సమయపాలనపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, అన్ని ప్యాసింజర్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయపాలనను మెరుగుపరచాలని, రైళ్లను సకాలంలో నడపడానికి కృషి చేయాలని ఆయన అన్ని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రస్తుతం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు.ఆయనతో రైల్వే అధికారులు,పోలిసులు పాల్గొన్నారు.
