HomeTelanganaNizamabadజిల్లాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు..జెండా ఆవిష్కరించిన బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్ రెడ్డి...

జిల్లాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు..జెండా ఆవిష్కరించిన బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్ రెడ్డి…

జిల్లాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు..జెండా ఆవిష్కరించిన బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్ రెడ్డి…

79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు.జిల్లా కి కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు.

అనంతరం ఈ యేడాది ఆయా రంగాల్లో జిల్లా సాధించిన పురోగతి వివరించారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఆయా పార్టీలు, స్వచ్ఛంద సంస్థల్లో జెండా ఎగురవేసి మహాన్నోత వ్యక్తుల ఆశయాలను నిరంతరం కాపాడాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వాతంత్ర్యం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తి అయినది. ఈ 78 సంవత్సరాలలో భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటిచెప్తూ ముందుకు సాగుతున్నది.

ఈ సందర్భముగా స్వాతంత్ర్యం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి స్మరించుకొనుట మన అని పేర్కొన్నారు.22 ఏప్రిల్ 2025 రోజున పహల్గాంలో జరిగిన అమానుష దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పర్యాటకులను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ వారికి నివాళులు అర్పించారు.

ఈ అమానుష దాడి తదుపరి మన సైన్యం చూపిన చొరవను భారత ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ప్రజలు తెలిపిన సంఘీభావం దేశ సమైక్యతకు చిహ్నంగా నిలిచిందనీ తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా, మహలక్ష్మి, గృహ జ్యోతి, చేయూత పథకం, రైతు ఋణ మాఫీ,ఇందిరమ్మ ఇండ్ల పథకం సజావుగా జరుగుతున్నందుకు ఆనందంగా వ్యక్తము చేశారు.

వ్యవసాయ రంగం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి 1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు పంటల సాగు వివరాలు నిజామాబాద్ జిల్లాలో వానాకాలం 2025 సంవత్సరం ఇప్పటి వరకు వరి 4 లక్షల 19 వేల ఎకరాలు, మొక్క జొన్న 52 వేల ఎకరాలు, సోయా చిక్కుడు 33 వేల ఎకరాలు, పసుపు 23 వేల ఎకరాలు మొత్తం 5 లక్షల 33 వేల ఎకరాలలో రైతులు పంట సాగు చేస్తున్నారని తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 97,696 మంది రైతులకు పంట రుణాలు 755 కోట్ల 29 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ప్రశంసలు తెలిపారు.నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజనులో ఇప్పటి వరకు 2,72,589 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 316 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిసినది.

రైతు బీమాజిల్లాలో 2024-25 సంవత్సరమునకు గాను ఇప్పటి వరకు రైతు బీమాకు అర్హత కలిగి వివిధ కారణాలతో చనిపోయిన 966 మంది రైతులకు సంబంధించిన వారి వారి నామిని బ్యాంకు ఖాతాలలో 48 కోట్ల 30 లక్షల రూపాయలు నేరుగా జమ చేయడం ద్వారా ఆయా కుటుంబాలకు మేలు జరిగింది.

నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి లో జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు తేది:03-06-2025 నుండి 20-06-2025 వరకు జరిగిన సదస్సుల్లో 40,462 దరఖాస్తులు అందాయి, అట్టి దరఖాస్తులు పరిష్కారానికి వివిధ దశలలో ఉన్నాయి.నిజామాబాద్ జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 17,301 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి.

అందులో 9,486 మార్కింగ్ పూర్తి కాగా, 4,820 బేస్మెంట్ పూర్తి అయినవి, 742 రూఫ్ లెవెల్ మరియు 237 స్లాబ్ లెవెల్ పూర్తి అయినవి అందుకు గాను 60.36 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.జిల్లాలో OP మరియు IP సేవల ద్వారా 7,28,974 ఔట్ పేషంట్ లకు మరియు 6,404 ఇన్ పేషంట్ లకు చికిత్స అందించటం జరిగింది.

వైద్య ఆరోగ్య సేవలు జిల్లాలోని 7 బస్తి దవాఖానాలలో 49,921 రోగులకు చికిత్స అందించటం జరిగింది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలు 55% ఉన్నవాటిని ప్రస్తుతం ప్రసవాలు 70% పైగా పెంచడానికి కృషి చేయడం జరుగుచున్నది.

వ్యాధి నిరోధక టీకాలు పూర్తి స్థాయిలో 13,409 మందికి అందించారు.జిల్లాలో 1,156 పాఠశాలల్లో 90,359 విద్యార్థినీ విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించబడుతుంది.2024-25 విద్యా సంవత్సరంనకు జిల్లాలోని పాఠశాలలకు 6,89,030 పాఠ్య పుస్తకాలను పాఠశాలకు పంపిణీ చేయడం జరిగింది.

అమ్మ ఆదర్శ పాఠశాల: 760 పాఠశాలల్లో అత్యవసర మరమ్మత్తు పనులు మంజూరు చేయబడ్డాయి. వీటిలో 598 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి మరియు 162 పాఠశాలల్లో పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ పధకానికి ఇప్పటి వరకు 22 కోట్ల 19 లక్షల 73 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు.

పదవ తరగతి పరీక్షల ఫలితాలుజిల్లాలో 2024-25 పదవ తరగతి పరీక్షలలో 96.62% ఉత్తీర్ణత సాదించడమైనది. జిల్లాలో ZPHS డొంకేశ్వర్ పాఠశాల విద్యార్థి అత్యధిక మార్కులు 586 సాధించి రాష్ట్రములోనే మొదటి స్థానములో నిలిచింది.

జిల్లాలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరములో 1,080 మంది లబ్ధిదారులకు 10 కోట్ల 81 లక్షల రూపాయలు పంపిణి చేయడం జరిగింది. అదేవిధంగా షాదీ ముబారక్ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరములో 672 మంది లబ్ధిదారులకు సుమారు 6 కోట్ల 72 లక్షల రూపాయలు పంపిణి చేయడం జరిగింది.

జిల్లావ్యాప్తంగా డయల్ 100 లో వచ్చే ఫిర్యాదుల ద్వారా స్వీకరించడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఫోన్ కాల్ కు సాద్యమైనంత త్వరితగతిన 5 నిమిషాలలో సమస్య పరిష్కరించడం జరిగుతుంది.ఫిర్యాదు దారుడు పోలీస్ స్టేషన్ కు రాకుండానే టి.యస్.కాప్, ట్విట్టర్, హాక్ఐ, ఫేస్ బుక్ ద్వారా ఫిర్యాదు చేసినట్లయితే వారి ఫిర్యాదులను స్వీకరించి వారికి సత్వర న్యాయం అందేలా చేయడం ట్రాఫిక్ లో సమూలమైన మార్పులు చేపడుతు పారదర్శకత మరియు జవాబుదారి తనంగా ఉండడము కోసం కేసులు నమోదుచేస్తు కాంట్రాక్టు మరియు నాన్ కాంట్రాక్టు విధానం ఉపయోగిస్తున్నాము.ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పంఅన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికి చేరడంలో సహకరించిన ప్రజాప్రతినిధులందరికి, అధికారులకు, ప్రతి ఒక్కరికి నా అభినందనలు.

ఈ కార్యక్రమమునకు విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పత్రికా విలేఖరులకు, స్వాతంత్ర్య సమరయోధులకు మరియు తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.అనంతరం జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments