పదవి విరమణ కు ఆరు నెలల ముందు ఎడాపెడా అప్పులు చేసాడు….దాదాపు మూడున్నర కోట్ల మేరకు వసూళ్లు చేసాడు.పదవి విరమణ చేసిన మరుసటి రోజు నుంచి గయాబ్ అయ్యాడుఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.
బాధితులు లబోదిబో మంటున్నారు. నిజామాబాద్ ప్రముఖ బీమ సంస్థ యల్ ఐ సి లో ఓ కీలక హోదా లో పనిచేస్తున్న ఉద్యోగి పదవి విరమణ కు ముందు ఆర్థిక అవసరాల కోసం అదే సంస్థ లో పనిచేస్తున్న 15 ఏజెంట్ లు 10 సహచర ఉద్యోగులతో పాటు మరో పది మంది వివిధ పనుల కోసం ఆఫీస్ కు వచ్చే వారి నుంచి అప్పుల రూపేణా 5 లక్షల నుంచి పది లక్షల మేరకు తీసుకున్నాడు అందుకు గాను చెక్ లు ప్రామిసరీ నోట్ లు సైతం ఇచ్చాడు నిజానికి సదరు ఉద్యోగి సంస్థ లో పనిచేసే కాలం లో మంచి వ్యక్తి గుర్తింపు తెచ్చుకున్నారు ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వకుండా పనిచేసారు. అందుకే అడిగిన వెంటనే అందరూ ఆర్థిక సహాయం చేసారు.
అదీగాక ఆఫీస్ ఆయన కీలక బాధ్యతల్లో వుండడం తో అడిగిన వెంటనే అప్పు ఇవ్వడం అనివార్యం అయింది. దాదాపు 25 మంది నుంచి మూడున్నర కోట్ల మేరకు అప్పులు చేసాడు చేసిన అప్పులను పదవి విరమణ తర్వాత వచ్చే మొత్తం ద్వార తీర్చేస్తానని అందరికి భరోసా ఇస్తూ వచ్చాడు.
ఆయన పదవి విరమణ చేసే టైం కూడా వచ్చేసింది. విరమణ చేసిన రెండో రోజే అప్పులు క్లియర్ చేస్తానని హామీ ఇచ్చాడు.వారికి మరింత నమ్మకం కల్గించడానికి బెనిఫిట్ లు నేరుగా బ్యాంకు ఖాతా లో జమ చేస్తారని అందుకే నేరుగా తనుకూడా ఆన్ లైన్ లోనే ఖాతా లో వేస్తానంటూ అందరి బ్యాంకు ఖాతా నెంబర్ లు సైతం తీసుకున్నాడు.
అన్నట్లుగా సదురు ఉద్యోగి రిటైర్ అయ్యాడు. ఆయన పదవి విరమణ రోజే ఆయన కు రావాల్సిన డబ్బు కూడా వచ్చేసింది. కానీ పదవి విరమణ చేసిన మరుసటి రోజు నుంచే ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు.
తమ అప్పులు తీరుస్తాడని ఎదురు చూస్తున్న వారంతా గాబరా పడ్డారు నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో లేరు.అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెల్సి లబోదిబో మన్నారు నగరంలో ప్రైమ్ ఏరియా లో ఖరీదైన ఇల్లు సైతం అప్పటికే గుట్టు చప్పుడు కాకుండా అమ్మేసాడట.
అదే కార్యాలయం లో ఉండే అతని సన్నిహితుడైన మరో ఉద్యోగి ని కల్సి కాళ్ళ వేళ్ళ పడుతున్నారు తమ డబ్బులు ఇప్పించాలంటూ వేడుకుంటున్నారు
