HomeTelanganaNizamabadశ్రీరామ్ సాగర్ కు... భారీ వరద - మహారాష్ట్ర విష్ణుపురి నుండి నీటి విడుదల -...

శ్రీరామ్ సాగర్ కు… భారీ వరద – మహారాష్ట్ర విష్ణుపురి నుండి నీటి విడుదల – ఎస్సారెస్పి లోనికి 68,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో- భారీగా చేరుతున్న ‘మహా’ వరద నీరు – ఆయకట్టు రైతుల్లో ఆనందం

గత వారం రోజుల క్రితం నుండి నీరు లేక వెలవెల బోయిన ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర నుంచి వరద నీరు పోటెత్తడంతో జలకళ సంతరించుకుంది.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు గరిష్టంగా 8709 క్యూసెక్కుల ఇన్ఫ్లో నీరు మాత్రమే వచ్చింది. అయితే ఎగువనే ఉన్న మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఎస్ఆర్ఎస్పి లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

ఇప్పటివరకు ఎగువ ప్రాంతాల నుంచి 5000 క్యూసెక్కుల నీరు రాగా, మహారాష్ట్ర వరద నీరు 63,516 వేల క్యూసెక్కుల చొప్పున ఇన్ఫ్లో వచ్చింది.

దీంతో 68516 క్యూసెక్కుల నీరు రావడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో భారీగా నీటిమట్టం పెరిగింది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments