హిందువులు సంఘటితం కావాల్సిన అవసరం వుందని ఆర్ యస్ యస్ అధినేత భగవత్ అన్నారు
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో శనివారం సాయంత్రం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ చీఫ్ మోహన్ భగవత్ పర్యటించారు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవర్ స్మృతి మందిరాన్ని ప్రారంభించారు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవర్ పూర్వికులు ఇక్కడే ఉన్నారని స్మృతి మందిరాన్ని ఇక్కడే నిర్మించాలని గతంలో నిర్ణయించడం జరిగిందని ఆయన అన్నారు
ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 11వ తేదీన తీసుకోవడం జరిగిందని స్మృతి మందిరం భవనాన్ని తిరిగి మళ్ళీ ఏప్రిల్ 11వ తేదీన అని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు కందకుర్తితో హెడ్గే వార్ కు ఎలాంటి సంబంధం ఉందో గరుడుకు సైతం ఈ ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని చరిత్ర చెబుతుందని ఆయన అన్నారు గరుడి విశిష్టతను వివరించారు
డాక్టర్ హెడ్గేవార్ భారతమాత విముక్తి కోసం శ్రమించాడు అని ఆయన అన్నారు దేశంలో అప్పుడున్న పరిస్థితులలో హిందువులని ఎవరో ఏదో చేయాల్సిన అవసరం లేదని మనలోనే లోపం ఉందని గుర్తించి ఐక్యత కోసం ఆర్ఎస్ఎస్ను స్థాపించారని చెప్పుకొచ్చారు శత్రువుల లూటీ కన్నా మనలో ఐక్యత లోపమే ఇందుకు కారణం అని ఆయన చెప్పుకొచ్చారు ఆర్ఎస్ఎస్ కు ఎవరితో శత్రుత్వం లేదని ఎవరు శత్రువులు కారని భరతమాత విముక్తి కోసమే పని చేస్తుంది అన్నారు
దేశభక్తి నిస్వార్థ సేవ ఆర్ఎస్ఎస్ నేర్పుతుందని చెప్పుకొచ్చారు ఇక్కడికి వచ్చిన వారంతా హెడ్గేవార్ స్ఫూర్తితో ముందుకు సాగాలి అని ఇక్కడి ప్రతి మట్టి అణువులో దేశభక్తి నిస్వార్థ సేవ ఉన్నాయని గుర్తు చేశారు ఇక్కడికి అందరూ ఒకే రోజు రావాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇక్కడికి వస్తూ ఉంటే ఈ మట్టి ప్రాధాన్యత ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు కందకుర్తి మట్టిలో నీటిలో హెడ్గేవర్ స్ఫూర్తి ఉందని అందరం కలిసి ఈ ప్రాంత విశిష్టతను ప్రపంచానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు
ఈ స్ఫూర్తితోనే ఇక్కడ నుంచి అందరం కదిలి వెళ్దామని స్మృతి మందిరం నిర్మాణం తోనే ఆగిపోవద్దని ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని వాటన్నింటినీ పూర్తి చేద్దామన్నారు స్మృతి మందిరం నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు
