బోధన్ పట్టణం రాకాసి పేటలో శనివారం జన గణన పేరిట వచ్చామని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు
గౌడ్స్ కాలనీలో మధ్యాహ్నం జనగణన పేరుతో కుటుంబ వివరాలు తెలపాలని ఇద్దరు వ్యక్తులు మౌనిక అనే మహిళ ఇంటి వద్దకు వచ్చారు మంచినీరు కావాలని ఇంట్లోకి చొరబడి ఆమె కాళ్లు చేతులను చున్నితో కట్టివేసి ఆమె మెడలోని మంగళ సూత్రాలు చెవి కమ్మలు కుమారు 4:30 తులాల బంగారు నగలు 68 తులాల వెండి వస్తువులను దోచుకుని వెళ్లినట్లు సిఐ తెలిపారు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ వివరించారు
