HomeCRIMEస్నేహం పేరుతో నమ్మించి.. ఏటీఎంతో రూ.1.05 లక్షలు స్వాహా..

స్నేహం పేరుతో నమ్మించి.. ఏటీఎంతో రూ.1.05 లక్షలు స్వాహా..

స్నేహం పేరుతో మద్యం తాగించి, బాధితుడి వద్ద ఉన్న భార్య ఏటీఎం కార్డును అపహరించి రూ.1.05 లక్షలు డ్రా చేసిన ఘటన నందిపేటలో వెలుగుచూసింది.

నందిపేట ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట కాలనీకి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగి చల్ల విష్ణువర్ధన్ జులై 17న నిజామాబాద్‌కు బయలుదేరిన సమయంలో తన స్నేహితులు నందిపేటకు చెందిన భోజగౌడ్, గంగాధర్ మార్గమధ్యంలో కలిసి మద్యం తాగించారని తెలిపారు. ఆ తర్వాత ఆయనకు తెలియకుండా తన భార్య విజయలక్ష్మి యూనియన్ బ్యాంక్ ఏటీఎం కార్డును తీసుకున్నారని పేర్కొన్నారు.

అనంతరం లష్కర్ లక్ష్మితో కలిసి విడతల వారీగా ఆ ఏటీఎం కార్డు ద్వారా రూ.1,05,000 నగదును డ్రా చేసి స్వాహా చేశారని ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు భోజగౌడ్, గంగాధర్, లష్కర్ లక్ష్మిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నందిపేట ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments