లింగంపేట్ పెద్దవాగులో రాంపల్లి కొనతాండకు చెందిన దేవ సోత్ శ్రీహరి (50) అనే గిరిజన రైతు సోమవారం రాత్రి పెద్దవాగులో గల్లంతైనట్టు తండా సర్పంచ్ తెలిపారు.సోమవారం రాత్రి భారీ వర్షంకురవడంతో శ్రీహరి రాత్రి 7 గంటలకు పెద్దవాగు సమీపంలోని తన పంట చేను వద్ద గల ఎడ్ల బండిని పశువులను ఇంటికి తీసుకొస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వాగు ఉధృతంగా ప్రవ హించడంతో శ్రీహరి ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయినట్లు తాండవాసులు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు శ్రీహరి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వాగులో గల్లంతైన శ్రీహరికి భార్య కమల, ఇద్దరు కుమారులు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. .
