ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ మెడికల్ ఇనిస్ట్యూట్ లో చిన్న పిల్లల వార్డులో సర్క్యూట్ తో ఏసీ పేలడంతో వార్డంతా పొగలు కమ్ముకున్నాయి. ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు సకాలం లో తల్లిదండ్రులు భయాందోళనలకు గురై తమ పిల్లలను తీసుకొని బయటకు పరుగెత్తారు
దీనితో భారీ అనర్థం తప్పింది.సీరియస్ గా ఉన్న ఇద్దరు చిన్నారులను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని శాంతినగర్కు చెందిన ఐదు రోజుల శిశువు మృతి చెందింది.
సిబ్బంది వెంటనే వార్డుకు విద్యుత్తు సరఫరా నిలిపి వేసి.. అందులోని పిల్లలను పక్క వార్డుకు తరలించారు. గాయాలపాలైన 24 మంది పిల్లలను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో , ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ఈ సంఘటన తో రోగులు,వారి వెంట ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.రిమ్స్ ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ఒక్కసారిగా ఏసీ పేలడంతో కలకలం రేగింది.ఏసీ పేలుడు ధాటికి పలువురికి గాయాలు కాగా.. దట్టమైన పొగలతో చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థతకు గురైన చిన్నారులను వెంటనే ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ప్రమాద విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షి షా హుటాహుటిన రిమ్స్‌కు చేరుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది నుంచి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుపత్రికి చేరుకున్న కలెక్టర్ రాజర్షి షా పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటన దురదృష్టకరమని. ఈ సంఘటన పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
