ఛీ ఛీ …..థు థు మీ బతుకు కార్పొరేషన్ లో ఉద్యోగులను ఎలా ఈసడించుకున్న తక్కువే కాసుల కక్కర్తి కోసం సొంత ఉద్యోగులను రాచి రంపాన పెట్టారు.
ఆఫీస్ కు వచ్చే సాధారణ ప్రజలను నానా గోస పెట్టె కార్పొరేషన్ ఉద్యోగులు చివరికి తమ కార్యాలయం లో పనిచేసే వారినీ వదల లేదు……ఎవరినో కాదు ఆమె ఏళ్ల తరబడిగా పనిచేసి న స్వీపర్ ను ! రోజు చెత్త చెదారం ను ఊడ్చేసి ఆఫీస్ ఆవరణ ను శుభ్రంగా వుంచేది ఆమె వయస్సు పైబడి ఈ మద్యే ఉద్యోగ విరమణ చేసింది ప్రభుత్వ ఇచ్చే ఆర్థిక సహాయం తో కుటుంబాన్ని ఉద్దరించాలని కలలు కన్నది.
పించన్ తో ఇతర ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి వస్తాయని ఆశ గా ఎదురు చూస్తుంది. ఏళ్ల తరబడిగా ఆమె కార్పొరేషన్ లో స్వీపర్ గా పనిచేసిన బుచ్చవ్వ తన పించన్ ఫైల్ ను క్లియర్ చెయ్యాలంటూ ఎస్టాబ్లిష్ మెంట్ విభాగం ఉద్యోగులను కోరింది.
ఆమె ఎంత తిరిగినా ఫైల్ ఒక్క అడుగుకూడా ముందుకు కదల లేదు దీనితో ఆమె కొడుకు అదే పని కోసం ఆఫీస్ కు ప్రదక్షిణలు చెయ్యడం మొదలు పెట్టారు. ఆమె కు రావాల్సిన బెనిఫిట్ ల విషయంలో తేడాలువచ్చాయి. వాటిని సరి చెయ్యాలంటూ ఆ విభాగంలో ఉండే అశోక్ కిరణ్ లను కోరాడు.
కానీ రూల్స్ ఒప్పుకోవని మొదట మారం చేశారు.చివరికి తమ వాటా ఇస్తే చూద్దామంటూ సన్నాయి నొక్కులు నొక్కారు అంతే డీల్ కు ఓకే అన్నాడు బుచ్చవ కొడుకు ఏకంగా రెండు ఇంక్రి మెంట్ లు జత చేస్తామని అందుకు 20 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు రెండు ఇంక్రి మెంట్ లు కలిస్తే కనీసం నాలుగు వేల రూపాయల లాభం వుంటుంది అందుకే సదరు బాధితురాలు ఒప్పకుంది.
అలాగే పింఛన్ ఫైల్ క్లియర్ చెయ్యడం నెలవారి పింఛన్ సైతం ఫిక్స్ అయ్యేలా చెయ్యడానికి మరో 15 వేల రూపాయలు ఇవ్వాలంటూ నిస్సిగ్గుగా బేరం కుదుర్చుకున్నారు. నిజానికి ఈ బేరం ముందే ఆడుకుంటే బాధితురాలు స్వచ్చందంగా ఇచ్చేసేది కానీ రోజుల తరబడిగా తిరిగి తిరిగి వేసారి పోయిన బాధితురాలు చివరికి కొడుకు ప్రోత్సహం తో ఏసీబీ కి ఆశ్రయించింది తోటి ఉద్యోగి నని కూడా కనికరం లేకుండా స్వీపర్ స్థాయి లో తనను డబ్బుల కోసం వేదించడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది
అందుకే సొంత ఉద్యోగుఅయితే ఏమిటి గట్టి గుణపాఠం నేర్పింది ఆఫీస్ లో కాకుండా లంచం నగదు 15 వేల రూపాయలు ఓ పంక్షన్ హల్ లో ఇస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టించింది.సొంత ఉద్యోగులను అదికూడా పించన్ ఫైల్ క్లియర్ చెయ్యడానికి సతాయించిన తీరు ను కార్పొరేషన్ లో తోటి ఉద్యోగులు అందులోనూ కిందిస్థాయి లో ఉండే వారు ఈసడించుకుంటున్నారు తగిన శాస్రి జరిగందంటున్నారు
