HomeCRIMEనగరంలో గంజాయి విక్రయం చేస్తూ ఇద్దరు అరెస్ట్..

నగరంలో గంజాయి విక్రయం చేస్తూ ఇద్దరు అరెస్ట్..

మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ముత్కేడ్‌కు చెందిన హమీద్ పటార్ గంజాయిని తీసుకొచ్చి, నగరంలోని 50 క్వార్టర్స్‌కు చెందిన మహమ్మద్ అయాన్‌తో కలిసి విక్రయిస్తున్నాడు.

ఈ మేరకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మంగళవారం నగరంలోని బోధన్ బస్‌స్టాండ్ ప్రాంతంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments