Thursday, April 16, 2026
HomeCRIMEఎక్సైజ్ శాఖలో ఆంధ్ర అధికారి ‘అరాచకం........ మనస్తాపంతో కుప్పకూలిన డిప్యూటీ కమిషనర్.......సర్వీస్ కు రాజీనామా...

ఎక్సైజ్ శాఖలో ఆంధ్ర అధికారి ‘అరాచకం…….. మనస్తాపంతో కుప్పకూలిన డిప్యూటీ కమిషనర్…….సర్వీస్ కు రాజీనామా ?

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఏపీ కి చెందిన ఉన్నతాధికారి తీరు తీవ్ర దుమారం రేపుతోంది. అతను అనుచిత వ్యాఖ్యలు, దురుసు ప్రవర్తనతో నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అర్ద రాత్రి ఆబ్కారీ ఆఫీస్ లోనే కుప్పకూలి పోయాడు అప్పటికే తన పదవికి రాజీనామా చేశారు.

కింది స్థాయి సిబ్బంది ముందే తనను వ్యక్తిగతంగా దూషించడాన్ని నిరసిస్తూ ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎక్సైజ్ అధికారుల బదిలీల వ్యవహారమే ఈ వివాదానికి మూలమని తెలుస్తోంది.

బదిలీల ప్రక్రియలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, కొందరి పట్ల కఠినంగా ఉండవద్దని సోమిరెడ్డి కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతిధికారి సోమిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

“ఇడియట్.. పండబెట్టి తొక్కుతా” అంటూ అత్యంత అసభ్యకరమైన పదజాలంతో కింది స్థాయి ఉద్యోగుల ముందే తనను దూషించారని దీనితో ఒక్కసారి గా సోమిరెడ్డి అక్కడే కుప్పకూలి పోయాడు ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని తాను ఉద్యోగంలో కొనసాగలేనని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. “ఒక సీనియర్ అధికారిగా ఉండి, తోటి అధికారుల గౌరవాన్ని మంటగలిపేలా కమిషనర్ మాట్లాడటం బాధాకరం. బదిలీల విషయంలో సలహా ఇస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టడం సరికాదు. ఆత్మగౌరవం లేని చోట నేను పని చేయలేను.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి చేవూరి హరి కిరణ్‌ను తెలంగాణకు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్రానికి లేఖ రాసి మరీ రప్పించుకున్నారు. అయితే, వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన తన అధికారాన్ని ప్రదర్శిస్తూ అధికారులపై అరాచకానికి దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖలోని ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా, అసభ్య పదజాలంతో అధికారులను దూషించిన ఉన్నతాధికారి మీద తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, తోటి గెజిటెడ్ అధికారులను కించపరచడం ఐఏఎస్ కేడర్ ప్రతిష్టకే భంగకరమని వారు పేర్కొంటున్నారు.ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందోనని సచివాలయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!