HomeCRIMEఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల మృతి ఒకరి పరిస్థితి విషమం

ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల మృతి ఒకరి పరిస్థితి విషమం

మాచారెడ్డి మండలం కాకుల గుట్ట తండా సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఒకరు విషయంగా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట గ్రామానికి చెందిన బంగ్లా అన్వేష్ గౌడ్ ,కోట అనిల్ యాదవ్, వికాస్, అనే యువకులు కారులో కామారెడ్డికి వెళ్లి తిరుగు ప్రయాణ ంలో మాచారెడ్డి కాకుల గుట్ట తండా రోడ్డు నుండి గంభీర్రావుపేట వెళ్లవలసి ఉండగా దారి తప్పి సిద్దిపేట రోడ్ ముందుకు వెళ్లి చెట్టుకు ఢీకొని ఒకరు మృతి చెంది ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు.

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బంగ్లా అన్వేష్ గౌడ్ మృతి చెందాడు వికాస్ కు తీవ్ర గాయాలతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు . కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపాడు.

కాగా ఈ సంఘటనతో గంభీరావుపేట మండల కేంద్రంలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెంది ఒకరి తీవ్ర గాయాల పాలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు పలువురుని కంటతడి పెట్టించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments