HomeCRIMEవివాదానికి దారితీసిన ఇంటి స్థలం ....మేయర్ భర్త ఫై సుత్తే తో దాడి చేసిన యువకుడు

వివాదానికి దారితీసిన ఇంటి స్థలం ….మేయర్ భర్త ఫై సుత్తే తో దాడి చేసిన యువకుడు

నిజామాబాద్ నగరంలోని నాగారం లో ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదం మేయర్ భర్త మీద సుత్తే తో యువకుడు దాడి చేసేదాకా వెళ్ళింది.

నాగారం లోని 80 క్వార్ట్రర్ ల వద్ద ఇంటి స్థలం విషయంలో మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్ కు అదే ప్రాంతానికి చెందిన శక్రు తో వివాదం జరుగుతుంది. ఆటో నడుపుతు జీవనం సాగిస్తున్న శుక్రుకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం కేటాయించారు ఈ మేరకు రెవెన్యూ అధికారుల నుంచి పట్టా కూడా ఉంది అయితే గత కొన్నేళ్లుగా ఆ స్థలం తమదంటూ ఓ వ్యక్తి రంగంలోకి వచ్చారు.

అతను శేఖర్ అనుచరుడు కావడంతో శక్రు అనేక సార్లు శేఖర్ ను ఆశ్రయించాడు. అయినప్పటికి ఆస్థలం విషయంలో వివాదం సాగుతూనే ఉంది. శేఖర్ మొన్నటిదాకా అధికార పార్టీ లో కొనసాగడంతో శక్రు సైలెంట్ గా ఉన్నారు.

కానీ కొందరు వ్యక్తులు ఆ స్థలం లోకి రావడానికి యత్నించారు ఈ నేపథ్యంలో శక్రు సోమవారం ఆటో రిక్షా లో నాగారం సమీపంలో మెయిన్ రోడ్ మీద శేఖర్ వద్దకు వెళ్లి చెయ్యి చేసుకున్నాడు .

ఆగ్రహం తో ఊగిపోయాడు ఒకరిద్దరు వారించే యత్నం చేయబోగా వారికి ధమ్కీ ఇచ్చాడు.ఆటో రిక్షా లో ఉన్న సుత్తెను తెచ్చి అప్పటికే కింద పడిపోయిన శేఖర్ మీద అందురూ చూస్తుండగానే విచక్షణ రహితంగా కొట్టాడు.దీనితో శేఖర్ అక్కడిక్కడే కుప్పకూలి పోయాడు. దీనితో స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments