బంగాళా ఖాతం లో అల్పపీడ ద్రోణి తో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయ్. కామారెడ్డి జిల్లాను వర్షాలు ముంచెత్తున్నాయి.అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. రాజంపేట్ మండల కేంద్రం ను వరద నీరు ముంచెత్తింది.
గ్రామం లో రెండు చెరువులకట్టలు తెగిపోయాయి
ఊర చెరువు , దేవుని చెరువు కట్టలు తెగిపోవడంతో గ్రామంలోకి భారీగా వరద నీరు చేరింది.నీటి ప్రవాహంతో గోడ కూలి రాజంపేట మండలం గుండారం పల్లె దావఖాన డాక్టర్ వినయ్ కుమార్ మృతి
బీసీ కాలనీ, కాటిపాపల కాలనీలు పూర్తిగా జలదిగ్బంధం లో చిక్కాయి రాత్రి నుండి కరెంట్ లేక అవస్థలు పడుతున్నరు.
కామారెడ్డిజిల్లా కేంద్రం నుంచి నుండి రాజంపేటకు రద్దయిన రాకపోకలుపూర్తిగా నిలిచి పోయాయి .కామారెడ్డి జిల్లా కేద్రంలోనూ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు వరద మరింత పెరగడంతో బుధవారం 11 గేట్లు ఎత్తారు.
ఎగువన ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సింగూర్ కు నుంచి వరద అనూహ్యంగా పెరగడంతో గత రాత్రి నుంచే ప్రాజెక్టు అధికారులు అప్రమత్తం అయ్యారు.
తెల్లవారు జామునే గేట్లు ఎట్టి నీటి ని దిగువకు వదులుతున్నారు మరో వైపు కళ్యాణి చెరువు కు భారీగా వరద రావడంతో నిజాంసాగర్ మండలం బొగ్గు కుంట రోడ్డు పనులకోసం వచ్చిన పది మంది కూలీలు చిక్కుక పోయారు.
