HomeHEALTHప్రభుత్వ ఆసుపత్రిలో అమానుషం.. వృద్ధురాలి పట్ల వైద్యుల నిర్లక్ష్యం.

ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుషం.. వృద్ధురాలి పట్ల వైద్యుల నిర్లక్ష్యం.

కాలు విరిగి చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చిన ఓ వృద్ధురాలిపై వైద్యులు కనికరం లేకుండా ఆసుత్రి బయట వదిలేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈఘటన కలకలం రేపుతోంది.

ఈ విషయం తెలుసుకున్న సిపిఎంఎల్ మాస్ లైన్(ప్రజా పంట)జిల్లా కార్యదర్శి వి.ప్రభాకర్ వృద్ధురాలి దగ్గరికి దగ్గరికి వచ్చి విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రి నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిందనీ ఆయన ఆరోపించారు.

పెర్కిట్ గ్రామానికి చెందిన బుజ్జమ్మను అనారోగ్యం కారణంగా ఈనెల 24న 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆమె కాలికి పట్టి కట్టిన వైద్యసిబ్బంది, కాలు విరిగిందని కూడా కనికరం లేకుండా ఆసుత్రి బయట వదిలేశారనీ మండిపడ్డారు.

అతి ఉత్సాహం చూపించిన పోలీసులు మమ్మల్ని మాట్లాడినీయకుండా,, డ్యూటీలో ఉన్న డాక్టర్, పేషెంట్తో ఎవరు లేకపోతే మేమేం చేయాలని ఎదురు ప్రశ్న వేయడం అబద్ధాలు మాట్లాడడం జరిగిందన్నారు.

కావున పేషంటు విషయాలన్నీ కూడా రికార్డును పరిశీలించి డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన, రేకుల షెడ్ లో పడేసిన సిబ్బంది పైన చర్య తీసుకోవలనీ జిల్లా కలెక్టర్ ను విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments