మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం తన అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి నుంచి అవమానాలతోనే గడిచిపోయిందని తెలిపారు. తన అనుచరుడు గంగారెడ్డిని నడి రోడ్డుపై నరికి చంపితే కాంగ్రెస్ అధిష్టానం, సిఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శలు గుప్పించారు.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో పాటు భరోసా కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని చూసినప్పుడల్లా బాధ తన్నుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ కుటుంబం కోసం తాను ఎంఎల్‌సిగా రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంతకాలం అవమానాలు బరించాలని జీవన్ రెడ్డి నిలదీశారు.
