సైబరాబాద్ కమిషనరేట్ ఫరీది లోని కూకట్‌పల్లి జేఎన్టీయూ ప్రాంగణం విద్యార్థుల ఘర్షణ రణరంగం ను తలపించింది.వర్సిటీలో అర్ధరాత్రి వేళ తీజ్ పండగ వేడుకల సమయంలో తలెత్తిన వివాదంచిలికి చిలికి గాలి వానల మారి , రెండువర్గాల విద్యార్థుల మధ్య పరస్పర దాడులకు దారితీసింది.
వేడుకల్లో భాగంగా మొదట ఓ విద్యార్థిపై పలువురు దాడికి పాల్పడటంతో వివాదం ప్రారంభమైంది. ఈ ఘటన క్రమంగా తీవ్రరూపం దాల్చడంతో వర్సిటీలోని గౌతమి, మంజీరా హాస్టళ్ల విద్యార్థులు గ్రూపు లుగా విడిపోయి చెప్పులు కర్రలతో దాడులకు దిగారు.
హాస్టల్ సిబ్బంది సమాచారం మేరకు హుటాహుటిన రంగంలోని దిగిన కేపీహెచ్‌బీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణలో గాయపడిన విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాఈ గొడవ విషయం తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే జేఎన్‌టీయూ క్యాంపస్‌కు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి విద్యార్థులను చెదరగొట్టారు. ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘర్షణకు దారితీసిన కారణాలు, దాడిలో పాల్గొన్న విద్యార్థుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల మధ్య ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ యాజమాన్యం కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కూకట్‌పల్లి జేఎన్టీయూ హాస్టల్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
విద్యార్థుల ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లిలో డీసీపీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గురువారం జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందన్నారు.
