HomeCRIMEజుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి

జుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి

బస్సు డ్రైవర్ మృతి తీవ్రంగా కలిచివేసింది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

జుక్కల్ ఎక్స్‌ రోడ్‌ దాటి బిచ్కుంద సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌-1 డిపోకు చెందిన బస్సు నంబర్‌ TS34Z0030 (ఎక్స్‌ప్రెస్‌), సర్వీస్‌ నంబర్‌ BCK3, హైదరాబాద్‌ నుంచి బిచ్కుంద వెళ్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిచ్కుంద సమీపంలో రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది.

ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ అంజనేయులు బస్సు కింద చిక్కుకుని మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బస్సులో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా బయటపడ్డప్పటికీ కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైన అన్ని వైద్య సహాయ చర్యలను తక్షణమే చేపట్టాలని సూచించారు.

అలాగే, ఆర్‌ఎం నేతృత్వంలో అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలను తెలుసుకుని, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments