గత కొద్దీ రోజులుగా కామారెడ్డి కాంగ్రెస్ సాగుతున్న వర్గ పోరు కు తాత్కాలిక విరామం వచ్చింది.
అవునూ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ రెడ్డి ల మధ్య ఎట్టకేలకు ఆదివారం గాంధీ భవన్ వేదిక గా రాజీ కుదిరింది. పీసీసీ క్రమశిక్షణ సంఘం చొరవ తో ఇద్దరు నేతలు కలిసి కాంగ్రెస్ ఉన్నతికి పనిచేయాలన్న అవగాహన కు వచ్చారు.
నేతల మధ్య సమన్వయ లోపం వస్తే పార్టీ పెద్దల దృష్టికి తేవాలని అంతే కానీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవద్దని కమిటీ చైర్మన్ మల్లు రవి సూచించారు అయితే షబ్బీర్ అలీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై సెల్ ఫోన్ లో చేసిన వ్యాఖ్యలపై తర్వాత చర్చిస్తామని అయినా ఆ వ్యవహారం ఏఐసీసీ పరిధి లోకి వెళ్లిందని క్రమశిక్షణ సంఘం పేర్కొంది.
షబ్బీర్ అలీ కి ఇప్పటికే షోకాజ్ నోటిస్ ఇచ్చిన క్రమశిక్షణ సంఘం ఆదేశాలతో ఆదివారం వివరణ ఇవ్వడానికి షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ షట్కర్ తో కల్సి గాంధీ భవన్ వెళ్లారు కానీ అప్పటికే గడ్డం చంద్ర శేఖర్ రెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్మెన్ కూడా అక్కడే ఉండడంతో కమిటీ ఛైర్మెన్ మల్లు రవి సభ్యుడు రామకృష్ణ లు ఇరువురు నేతలతో ఫెస్ టు ఫెస్ గా మాట్లాడారు. ఇద్దరికి సర్ది చెప్పడంతో వారు దిగివచ్చి రాజీ కి ఓకే చెప్పారు.
