ఎన్నో బోగస్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ను తాము ఎట్టిపరిస్థితుల్లో కూల్చబోము మా కాళ్ళు చేతులు గుల్ల గుల్ల అంటలేవు ప్రభుత్వంను కులగొట్టటానికి…. ప్రజలే మీ వీపులు పగలగొట్టే రోజులొస్తాయని బిఆర్ యస్ అధినేత మాజీ సీఎం కెసిఆర్ నిప్పులు చెరిగారు వరంగల్ లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా లో ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేసారు .ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం తరలివచ్చారు. కెసిఆర్ స్పీచ్ ఆద్యంతం ప్రజలను ఉత్సహం కలిగించింది.
నా కళ్ల ముందే మళ్లీ తెలంగాణ ఇలా మారుతుంటే తట్టుకోలేకపోతున్నానని దుఃఖం బాధ కలుగుతుందన్నారు ఏడాదిన్నర కే తెలంగాణ ను ఆగం జేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు . తులం బంగారం రాలేదు. ఇంటింటికీ మంచినీళ్లు రాలేదు. ఆర్టీసీల్లో మహిళల మధ్య గొడవలు సృష్టించి తెలంగాణను మళ్లీ కకావికలం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో భూముల ధరలు అద్భుతంగా ఉండేవని..
ఏడాదిలోనే అంతా తలకిందులు చేశారని మండిపడ్డారు. పదేళ బీఆర్ఎస్ పాలనలో.. ఎక్కడో ఉన్న తెలంగాణను చాలా ముందకు తీసుకెళ్లిపోయాం.. పదేళ్లలో అద్భుతమైన పనులు చేసి చూపించాం..
ఎన్నో రంగాల్లో తెలంగాణను నంబర్‌వన్ చేశాం.. చెరువుల నిండా నీళ్లు.. రికార్డుస్థాయిలో పంటలు పండించాం.. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం.. అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నామని అన్నారు. 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనుగోలు చేశాం.. మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్స్, కంటివెలుగు, కళ్యాణలక్ష్మీ లాంటి పథకాలు ఎవరూ అడగకపోయినా అమలు చేశాం..
ఐటీ రంగంలోకి కొత్తగా 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని బీరాలు పలుకుతున్నారు
తాము అధికారంలో ఉండగా విచక్షణతో పనిచేశాం.. రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని అలాగే కొనసాగించామని అన్నారు. ఇలా పనిచేయడం చేతగాక హైడ్రా అనే ఒక దరిద్రాన్ని తీసుకొచ్చి ప్రజలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. హెచ్‌సీయూ భూములు అమ్ముకుంటున్నారు. అసలు ఏ భూములు అమ్ముకోవాలి. ఏ భూములు అమ్మకూడదో విచక్షణ ఉండాలని సూచించారు.
//// పోలీసులు దుంకు లాడొద్దు /////
వందకు వందశాతం మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఎవ్వరూ ఆపలేరని అవసరమైతే డైరీల్లో రాసుకోండి అని సూచించారు.
పోలీసులు ఎందుకు అనవసరంగా దుంకు లాడుతున్నారు కూడా జాగ్రత్తగా ఉండాలని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని.. నేను కూడా రేపటినుంచి బయల్దేరుతా ఒక్కొక్కరి సంగతి చూస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘///// ఆపరేషన్ కగార్ తక్షణమే ఆపేయాలి/////
ఛత్తీస్ ఘడ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ కాగర్ ను వెంటనే ఆపేయాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో గిరిజనులను, అమాయకులను ఊచకోత కోస్తున్నారని తెలిపారు. బలం ఉందని ప్రాణాలు తీసుకుంటూ పోవడం కరెక్ట్ కాదని అన్నారు.మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తామని అంటున్నారని, వెంటనే కూంబింగ్, కాల్పులు ఆపి.. వారితో చర్చలకు ముందుకు రావాలని కేంద్రానికి సూచించారు. ఆపరేషన్ కగార్ ఆపి, శాంతి చర్చలు జరపాలని కోరుతూ తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు..
