ఇందూర్ నగరం : రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలలో తడిసిన పంటను పరిశీలించడానికి, రైతులను పరామర్శించడానికి శ్రద్ధనంద్ గంజ్ లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు సందర్శించడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం అని గొప్పలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలం అయిందన్నారు.
గత పదిహేను రోజుల నుండి తెలంగాణాలో అకాల వర్షాలకు రైతులు తమ పండించిన పంట నష్టపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.
రైతన్నలు పండించిన వరి పంట అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారని అన్నారు, కొనుగోలు కేంద్రాలలో బస్తాల కోరత, హమాలీ కోరత, ట్రాన్స్ పోర్ట్ కీ లారీల కోరత కారణంగా రైతన్నలు మండుటెండలో రోజుల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఉందన్నారు.
ఇందూర్ జిల్లాలో ఇప్పటివరకు 40% కూడా వడ్ల కొనుగోలు జరగలేదని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్ల పైన ఉన్న శ్రద్ద రైతుల పైన లేదని ఏద్దేవా చేసారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 500 బోనస్ అంత బోగస్ అన్నారు రైతు పండించిన పది రకాల పంటలకు బోనస్ ఇస్తానని కేవలం సన్న వడ్లకే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఏద్దేవా చేసారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు నష్టపోకుండా వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎటువంటి తరుగులు తీయకుండా, బస్తాల కోరత, హమాలీ కోరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
రైస్ మిల్లర్ల సమస్య, కొనుగోను కేంద్రాలలో ఉన్న పలు సమస్యలపై జాయిట్ కలెక్టర్ తో ఎమ్మెల్యే గారు ఫోన్ లో మాట్లాడి త్వరతగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్ధిక భరోసాగా ఫసల్ భీమా యోజన అమలు చేస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని అన్నారు తక్షణమే ఫసల్ భీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలనీ డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో AMC గంజ్ ఇంచార్జ్ శకుంతల, బిజెపి జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
