HomeCRIMEగంటల్లోనే అదృశ్యమైన బాలుడి గుర్తింపు..తల్లిదండ్రులకు అప్పగించిన కమ్మర్‌పల్లి పోలీసులు

గంటల్లోనే అదృశ్యమైన బాలుడి గుర్తింపు..తల్లిదండ్రులకు అప్పగించిన కమ్మర్‌పల్లి పోలీసులు

కమ్మర్‌పల్లి పోలీసుల వేగవంతమైన చర్యలతో అదృశ్యమైన 15 ఏళ్ల బాలుడిని గంటల వ్యవధిలోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్ గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన ఎస్సై సీహెచ్. సతీష్, కానిస్టేబుళ్లు నరేష్, దినేష్, హరీష్‌తో కలిసి గాలింపు చేపట్టారు.

సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ బాలుడి కదలికలను గుర్తించారు.దర్యాప్తులో బాలుడు ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని క్షేమంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.

అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో వారికి అప్పగించారు. బాలుడు అదృశ్యమైన వెంటనే స్పందించి గంటల వ్యవధిలోనే క్షేమంగా గుర్తించిన కమ్మర్‌పల్లి పోలీసుల సేవలను బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసించారు. ఈ ఘటనలో సమర్థవంతంగా వ్యవహరించిన ఎస్సై సీహెచ్. సతీష్, పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments