Monday, April 20, 2026
HomeTelanganaNizamabadఎస్సారెస్పీ గేట్ల ఎత్తివేత- నిండుకుండల మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

ఎస్సారెస్పీ గేట్ల ఎత్తివేత- నిండుకుండల మారిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు

– భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు – పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్ జారీ చేసిన అధికారులు

: ఎగువన మహారాష్ట్రతో పాటు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గత రాత్రి 10 క్యూసెక్కుల నీరు, ఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు లోనికి వచ్చి చేరడంతో అధికారులు 8 గేట్లు ఎత్తివేశారు.

34,853 క్యూసెక్కుల నీటిని గోదావరిలోనికి వదులుతున్నారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఎస్సారెస్పీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరింత ఇన్ఫ్లో వచ్చి చేరే అవకాశం ఉంది.

ఎనిమిది గేట్లు ఎత్తివేసి గోదావరి లోనికి నీరు వదలడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు తరలివస్తున్నారు.

వరద ప్రవాహం పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!