ఆటో ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నగర శివారులోని శ్రీనగర్ వద్ద ఓ ఆటోను లారీ ఢీ కొట్టడంతో మాక్లూర్ కు చెందిన షేక్ ఫర్వన్, షేక్ ఇంతియాజ్ అను ఇద్దరి వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
దీంతో లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారీ అయ్యాడు. సమాచారం తెలుసుకున్న సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
