నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి మాతృమూర్తి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ గురువారం ఆమె కుటుంబాన్ని పరామర్శించారు.
నగరంలోని కసాబ్‌గల్లీ (49వ డివిజన్)లోని మేయర్ నివాసానికి వెళ్లిన ఆయన.. ఉమారాణి, కుటుంబసభ్యులను ఓదార్చారు. మాతృమూర్తి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
