ఆదివారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ నగర కార్యదర్శి వై. ఓ మయ్య మాట్లాడుతూ.. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, పేదా,దనిక తేడా లేని సమ సమాజ స్థాపన కోసం ఏర్పడిన సిపిఐ పార్టీ భారతదేశంలో కార్మిక వర్గాన్ని, మహిళలను, విద్యార్థులను, యువకులను ఐక్యం చేసి అన్ని చట్టాలను సాధించిన పార్టీ అన్నారు.
ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో నిజాం వ్యతిరేక పోరాటం నిర్వహించే భూస్వాముల మెడలు వంచి పది లక్షల ఎకరాల భూమి పంచి పెట్టిన కమ్యూనిస్టు పార్టీ 4000 మంది కార్యకర్తల ప్రాణాలను త్యాగం చేసిందన్నారు.
ఇటువంటి చారిత్రాత్మకమైన పార్టీ 100 సంవత్సరాల శత జయంతి ఉత్సవాల ప్రారంభ సూచికంగా నల్గొండలో జరిగే బహిరంగ సభలో సిపిఐ పార్టీ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో నాయకులు అలీ ఇమ్రాన్, సఖి సురేష్, కె. గంగాధర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు
