ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మోపాల్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. డిచ్ పల్లి మండలం గన్పూర్ గ్రామానికి చెందిన మారుతి(32). భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శుక్రవారం నర్సింగ్ పల్లి గ్రామంలోని మారుతి చిన్నమ్మ కూతురు వివాహానికి వెళ్లి వివాహం అనంతరం అక్కడే బస చేశారు. శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ శివారులోని చెరువులోకి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు.