ఆర్టీసీ బస్సు కండక్టర్ బ్యాగులో నుంచి డబ్బులు మాయం అయ్యాయి.
ఈ ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. భైంసా డిపోకు చెందిన బస్సు నిజామాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి భైంసా కు వెళ్తున్నది.
ఈ నేపథ్యంలో బస్సు నగర శివారులోని సారంగాపూర్ వరకు చేరుకోగానే కండక్టర్ బ్యాగులో ఉన్న సుమారు 10 వేల రూపాయలు లేకపోవడంతో ఒక్క సారిగా కంగు తిన్నాడు.
దీంతో వెంటనే బస్సును 6వ టౌన్ ముందు ఆపి అందరినీ అడగగా అందరూ మాకు తెలియదంటూ తప్పించుకున్నారు.దీంతో అప్పటికే బస్సులో ఉన్న ప్రయాణికులకు ఆలస్యమవుతున్న నేపథ్యంలో బస్సు వెళ్లి పోయింది. మరక మరల తిరిగి వచ్చి పిటిషన్ ఇస్తాను అన్నట్లు సమాచారం.
