HomeLaw and Orderనిజామాబాద్ ఖలీల్వాడిలో ట్రాఫిక్ సమస్యల నివారణకు కొత్త పార్కింగ్ సదుపాయం – కమిషనర్ సాయి చైతన్య...

నిజామాబాద్ ఖలీల్వాడిలో ట్రాఫిక్ సమస్యల నివారణకు కొత్త పార్కింగ్ సదుపాయం – కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు

కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు నిజాంబాద్ నగరంలోని ఖలీల్వాడిలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నందున ట్రాఫిక్ నియంత్రణకు కట్టడికి చర్యలు తీసుకోవడంలో భాగంగా కమిషనర్ గారు ఖలీల్వాడిలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పార్కింగ్ చేయాలని నిశ్చయించి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ఇన్స్పెక్టర్ ప్రసాదు ను ఆదేశించగా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది మున్సిపల్ సిబ్బంది సహకారంతో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు పార్కింగ్కు ఏర్పాట్లు చేసి ఖలీల్ వాడికి వచ్చే వాహనదారులకు పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది .

అదేవిధంగా పార్కింగ్ కొరకు రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముందు మరియు పార్కింగ్ స్థలంలో టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ పార్కింగ్ కొరకు ఏర్పాటుచేసిన ప్రదేశాల వద్ద ప్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీ నిర్ణయాన్ని నగర ప్రజలు స్వాగతించారు.పి ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments