HomeTelanganaNizamabadఎక్సైజ్ వాహనాల బహిరంగ వేలం..

ఎక్సైజ్ వాహనాల బహిరంగ వేలం..

జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ స్వప్న తెలిపారు.

ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 16న (సోమవారం) ఉదయం 10 గంటలకు సుభాష్ నగర్‌లోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సమీపంలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ఈ వేలం పాట జరుగుతుందన్నారు.

వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు రూ. 5,000 ధరావత్తు చెల్లించి హాల్ టికెట్ పొందాల్సి ఉంటుందనీ అన్నారు. హాల్ టికెట్ ఉన్న వారిని మాత్రమే వేలం పాటలోకి అనుమతిస్తారని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments