HomeTelanganaNizamabadకాంగ్రెస్ లో పంచాయితీ జోష్ .....తొలి విడతలో భారీ ఆధిక్యం ......పోచారం సుదర్శన్ రెడ్డి ఇలాఖాలో...

కాంగ్రెస్ లో పంచాయితీ జోష్ …..తొలి విడతలో భారీ ఆధిక్యం ……పోచారం సుదర్శన్ రెడ్డి ఇలాఖాలో సానుకూల ఫలితాలు ……పోటీ ఇవ్వలేక పోయిన గులాబీ …….ప్రాబల్యం పెంచుకున్న బీజేపీ

లోకసభ ఎన్నికల తర్వాత జిల్లాలో ప్రదాన పార్టీల్లో పంచాయితీ ఎన్నికల సందడి కనిపిస్తుంది.గత పదేళ్లుగా నామ మాత్రం ఉనికి సాగించిన కాంగ్రెస్ ఈసారి బౌన్స్ బ్యాక్ అయింది.

అధికారంలోకి వచ్చి రెండేళ్ల సంబరాలు జరుపుకుంటున్న వేళ పంచాయితీ ఎన్నికల్లో భారీ ఆధిక్యం చాటింది దాదాపు 60 శాతం మేరకు పంచాయితీ లను స్వాధీనం చేసుకుంది.

దిగ్గజ నేతలు సుదర్శన్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవరాల్లోనే మొదటి విడత పంచాయితీ జరగడంతో ఫలితాలు ఏక పక్షంగా వచ్చాయనే టాక్ ఉంది.

అసలు పరీక్షా రెండు మూడో దఫా ఎన్నికల్లో ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.మూడోదఫా జరిగే ఆర్మూర్ బాల్కొండ సెగ్మెంట్ లలో కాంగ్రెస్ పార్టీ కి సానుకూలత ఏ మేరకు వుందనేది పంచాయితీ ఎన్నికల్లో తేలనుంది.

ఈ ప్రాంతాల్లో కొందరు కాంగ్రెస్ నేతల అవినీతి… ఆగడాలు …దందా ల ఫై పార్టీ ప్రతిష్ట మసక బారింది.కానీ బిఆర్ యస్ నేతలు క్రియాశీలంగా లేక పోవడం కాంగ్రెస్ నేతలకు కలిసి వస్తుంది .

మొదటి 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు.

నిజామాబాద్ ఇది జిల్లా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన పై ఉన్న నమ్మకమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో ప్రజా పాలన అందిస్తూ ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే వారి విజయానికి కారకులైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

మొదటి దఫా ఎన్నికలు జరిగిన బాన్స్ వాడ బోధన్ నియోజకవర్గాల్లో పంచాయితీ ఎన్నికలను అసలు పట్టించుకోలేదు సర్పంచ్ లుగా వార్డు మెంబర్ లుగా పోటీ చేసే వారికి ఆర్థిక తోడ్పాటు చేయాల్సి వస్తుందనే భయంతో మాజీ ఎమ్మెల్యే లు నామ మాత్రంగా పనిచేసారు అదే బిఆర్ యస్ ను దెబ్బతీసింది కానీ కాంగ్రెస్ అధికారంలో వుండడం తో పాటు సుదర్శన్ రెడ్డి పోచారం ఈ ఎన్నికలను ఛాలెంజ్ గానే తీసుకున్నారు అయినా మండల కేంద్రాల్లో ప్రతికూల ఫలితాలు చూసారు.

పదేళ్ల అభివృద్ధి చెప్తూ కొద్దిగా ఆర్థిక తోడ్పాటు ఇస్తే చాల చోట్ల బిఆర్ యస్ అభ్యర్థులు గెలిచే ఛాన్స్ ఉండే. గతంలో 90 శాతం సర్పంచ్ స్థానాలు గెలిచి భుజాలు ఎగిరేసిన మాజీ ఎమ్మెల్యే లు ఇప్పుడు అధికారం కోల్పోయాక కనీస ప్రభావం చూపలేక పోయారు మరో వైపు ఈసారి బీజేపీ అంచనాలకు మించే పలితాలు సాదించింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments