HomeLaw and Orderనిజామాబాద్ ఆర్డిఓ రాజేంద్ర కుమార్ 79వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో...

నిజామాబాద్ ఆర్డిఓ రాజేంద్ర కుమార్ 79వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో సిబ్బంది పాల్గొన్నారు

79వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భముగా ప్రసంగం….

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భముగా జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు, అధికారులకు, మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు మరియు విద్యార్థినీ విద్యార్థులకు నా ఆశీస్సులు.

స్వాతంత్ర్యం సిద్ధించి 78 సంవత్సరాలు పూర్తి అయినది. ఈ 78 సంవత్సరాలలో భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించుకుంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటిచెప్తూ ముందుకు సాగుతున్నది.

ఈ సందర్భముగా స్వాతంత్ర్యం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి స్మరించుకొనుట మన విధి. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.

అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచిన మనం..

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శతృవులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వాతంత్ర్యానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం.

22 ఏప్రిల్‌ 2025 రోజున పహల్గాంలో జరిగిన అమానుష దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పర్యాటకులను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాము.

ఈ అమానుష దాడి తదుపరి మన సైన్యం చూపిన చొరవను భారత ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ప్రజలు తెలిపిన సంఫీుభావం దేశ సమైక్యతకు చిహ్నంగా నిలిచింది.స్వాతంత్ర్యం ఏర్పడే నాటికి భారత దేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు మరియు వ్యక్తుల మధ్య అసమానతలతో నిండి యున్నది.

స్వాతంత్ర్యం అంటే ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలైన కూడు, గూడు, గుడ్డ లభించేలా ఉండడం తమ కాళ్ళపై తాము స్వేచ్ఛాయుతంగా ఎదగడం.నిజామాబాద్ జిల్లాలో రైతు భరోసా, మహలక్ష్మి, గృహ జ్యోతి, చేయూత పథకం, రైతు ఋణ మాఫీ మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకం సజావుగా జరుగుతున్నందుకు ఆనందంగా వ్యక్తము చేస్తున్నాను.

1. వ్యవసాయ రంగంప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి 1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారుపంటల సాగు వివరాలునిజామాబాద్ జిల్లాలో వానాకాలం 2025 సంవత్సరం ఇప్పటి వరకు వరి 4 లక్షల 19 వేల ఎకరాలు, మొక్క జొన్న 52 వేల ఎకరాలు, సోయా చిక్కుడు 33 వేల ఎకరాలు, పసుపు 23 వేల ఎకరాలు మొత్తం 5 లక్షల 33 వేల ఎకరాలలో రైతులు పంట సాగు చేస్తున్నారని తెలిసినది.

ఎరువుల సరఫరా: 2025 వానాకాలంకు గాను అవసరమైన ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచడం, ఇప్పటి వరకు యూరియా 59,236 మెట్రిక్ టన్నులు, డి.ఏ.పి 11,385 మెట్రిక్ టన్నులు, పొటాష్ 2,516 మెట్రిక్ టన్నులు మరియు కాంప్లెక్స్ ఎరువులు 52,057 మెట్రిక్ టన్నులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మరియు ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం సంతోషకరము.

అత్యవసరమైన పరిస్థితులను ఎదుర్కొనుటకై 1,746 మెట్రిక్ టన్నులు యూరియా బఫర్ లో ఉంచడం జరిగిందని కూడా సమాచారము.రైతు రుణమాఫీ పథకంగత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పని చేయడము విశేషము రాయని కొత్త చరిత్ర రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, రైతుల విషయంలో రాజీ పడకుండా.

తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించారు.ఈ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 97,696 మంది రైతులకు పంట రుణాలు 755 కోట్ల 29 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ప్రశంసనీయము.

రైతు భరోసాఇందిరమ్మ రైతు భరోసా” కింద ఎకరాకు 12 వేల రూపాయల పెట్టుబడి సాయం ప్రకటించారు. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం చేశారు. జూన్ 16న ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు.

రాష్ట్రంలోని 70 లక్షల, 11 వేల, 184 మంది రైతులకు ఈ సాయం అందించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించారు.

నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం సీజనులో ఇప్పటి వరకు 2,72,589 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 316 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిసినది.రైతు బీమాజిల్లాలో 2024-25 సంవత్సరమునకు గాను ఇప్పటి వరకు రైతు బీమాకు అర్హత కలిగి వివిధ కారణాలతో చనిపోయిన 966 మంది రైతులకు సంబంధించిన వారి వారి నామిని బ్యాంకు ఖాతాలలో 48 కోట్ల 30 లక్షల రూపాయలు నేరుగా జమ చేయడం ద్వారా ఆయా కుటుంబాలకు మేలు జరిగింది.

2. భూ భారతికీలక సంస్కరణల్లో ఒకటిగా భూ భారతి చట్టం – 2025 నిలిచింది. ఇది జనవరి 4, 2025 న గెజిట్‌లో ప్రచురించబడింది, ఏప్రిల్ 14, 2025 న అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేయబడింది.

జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో రైతులకు అవగాహన సదస్సులు తేది:17-04-2025 నుండి 30-04-2025 వరకు నిర్వహించబడ్డాయి. రెవెన్యూ సదస్సుల వలన భూ సంబంధిత సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కరించే అవకాశముంటుంది.

జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు తేది:03-06-2025 నుండి 20-06-2025 వరకు జరిగిన సదస్సుల్లో 40,462 దరఖాస్తులు అందాయి, అట్టి దరఖాస్తులు పరిష్కారానికి వివిధ దశలలో ఉన్నాయి.

3. గృహ నిర్మాణ శాఖ:ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇంటి స్థలం కలిగి ఉన్న వారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్ళల్లో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొనుటకు ఆర్థిక సహాయం చేయడానికి ఈ పథకము ప్రారంభించడం జరిగింది. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు.

అవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికి 22,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తున్నారు. గ్రీన్ ఛానెల్ లో నిధులు విడుదల చేస్తున్నారు. ఒక్క ఏడాదిలో నాలుగు లక్షల 50 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయబోతున్నారు.నిజామాబాద్ జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 17,301 ఇండ్లు మంజూరు చేయబడ్డాయి.

అందులో 9,486 మార్కింగ్ పూర్తి కాగా, 4,820 బేస్మెంట్ పూర్తి అయినవి, 742 రూఫ్ లెవెల్ మరియు 237 స్లాబ్ లెవెల్ పూర్తి అయినవి అందుకు గాను 60.36 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.

4. పౌర సరఫరాల శాఖ:70 ఏళ్లుగా PDS వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నారు. రేషన్ కార్డు… ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా…భావోద్వేగం.

ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. ప్రజా పంపిణీ పథకం:

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4,03,510 ఆహార భద్రత కార్డుల ద్వారా 13,94,503 మంది ప్రజలు లబ్ది పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3 నెలల బియ్యమును అనగా జూన్ నుండి ఆగస్ట్ 2025 వరకు మొత్తం 26,217 మెట్రిక్ టన్నుల ఉచిత సన్న బియ్యంను పంపిణి చేయడం జరిగింది.

జిల్లాలో జనవరి 2025 నుండి ఇప్పటి వరకు 11,852 కొత్త ఆహార భద్రత కార్డులు మంజూరు చేసి పంపిణి చేయడం జరిగినది. మరియు పెండింగ్ లో ఉన్న వాటిని క్షేత్ర స్థాయి పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారులకు పంపిణి చేయడం జరుగుతుంది.

ఇది నిరంతర ప్రక్రియ.మహా లక్ష్మి పథకముఈ పథకం ద్వారా 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అర్హులైన రేషన్ కార్డుదారులకు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు “మహాలక్ష్మి” పథకం నందు 2,19,330 గ్యాస్ వినియోగదారులకు, 10,19,994 సిలిండర్లకు సబ్సిడీ విడుదల చేసి మొత్తం 30 కోట్ల 73 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది.

కనీస మద్దతు ధర పై ధాన్యం కొనుగోలు: 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్‌ ఇస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు.

దీని కోసం 16,691 కోట్ల రూపాయల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2024-25 వానాకాలం సీజన్ లో 676 కేంద్రాల ద్వారా 4,91,497 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 78,488 రైతుల నుండి కొనుగోలు చేసి 1,140 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది.

అలాగే యాసంగి సీజన్ లో 700 కేంద్రాల ద్వారా 8,40,279 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 1,16,000 రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 1,949 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ధాన్యం కొనుగొలులో మన జిల్లా ఖరీఫ్ మరియు రబీ సీజను లో రాష్ట్రం లోనే ప్రథమ స్ధానంలో నిలిచింది.5.

విద్యుత్ శాఖ:జిల్లాలోని అన్ని క్యాటగిరిల వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. పాడైన విద్యుత్ నియంత్రికల స్థానంలో పట్టణాలలో 24 గంటలలో మరియు గ్రామాలలో 48 గంటలలో బాగు చేసిన విద్యుత్ నియంత్రికలతో మార్చడం జరుగుతుంది.

గృహ జ్యోతిమార్చ్- 2024 నుండి జులై – 2025 వరకు ప్రతి నెల 2,67,707 మంది వినియోగదారులకు ‘0’ బిల్లులు మంజూరు చేయడం జరిగింది. వారికి ‘0’ బిల్లు సబ్సిడీ క్రింద ప్రభుత్వం 165 కోట్ల 30 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది.నాయీబ్రాహ్మణ మరియు రజక వృత్తుల వారికి జులై – 2025 వరకు ఈ పథకం క్రింద 3,023 మంది లబ్దిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడం జరిగింది.

టిజి-ఐపాస్ పథకం క్రింద ఏప్రిల్-2025 నుండి జులై-2025 వరకు క్రొత్తగా 12 ఇండస్ట్రీలకు మొత్తంగా 686 ఇండస్ట్రీలకు విద్యుత్ సరఫరా ఇవ్వబడినది. సి.యం. గిరివికాస్ పథకం క్రింద జులై-2025 వరకు 78 మంది లబ్దిదారులకు వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్తు సౌకర్యo కల్పించడo జరిగింది.6. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ:మహలక్ష్మి పథకం:మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించారు.

ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా అయ్యింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం జరిగింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చారు.నిజామాబాద్ జిల్లాలో 6 కోట్ల 8 లక్షల మంది మహిళా ప్రయాణీకులు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు.

పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తెలంగాణ మహిళా ప్రయాణీకులకు ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత 10.08.2025 నాటికి ఈ పథకం వలన జిల్లాలోని మహిళలకు 249 కోట్ల 13 లక్షల ఆదాయం ఆదా అయింది. సగటున ప్రతిరోజు ఒక లక్ష మంది మహిళా ప్రయాణీకులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు.

మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినిలు, ట్రాన్ జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించ వచ్చును. 24.12.2024 రోజు నుండి ఎలక్ట్రికల్ ఎక్స్ ప్రెస్ బస్సులు ప్రారంభించబడినవి. వీటిలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించబడినది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకం అమల్లోకి వచ్చినప్పటి నుండి తేది:23.07.2025 వరకు 200 కోట్ల మంది మహిళా ప్రయాణీకులు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు.

ఈ పథకం వల్ల మహిళలకు 6,680 కోట్ల ఆదాయం ఆదా అయినది.

7. డైట్ మరియు కాస్మోటిక్ చార్జీలు పెంపుబి.సి., యస్.సి., యస్.టి., మైనారిటీ సంక్షేమ మరియు గురుకులలో అక్టోబర్ 2024 నుండి పోస్ట్ మెట్రిక్ చదివే విద్యార్థుల వరకు (40%) “కాస్మోటిక్” మరియు (200%) “డైట్ చార్జీలు” పెంచడం జరిగింది.

8. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ:ఆసరా పింఛనులు: జిల్లాలోని 2,50,610 మంది వివిధ రకాల ఆసరా పింఛనుదారులకు నెలవారి పింఛను 2,016 రూపాయలను చెల్లించడము జరుగుతుంది. మరియు 18,564 మంది వికలాంగులకు నెల వారి పింఛన్ 4,016 రూపాయలు ఇవ్వడము జరుగుతుంది. జిల్లాలో పెన్షన్ ల రూపేణ ప్రతి నెల 2,69,174 మందికి 57 కోట్ల 98 లక్షల రూపాయలు పంపిణీ చేయబడుతుంది.

2024-25 సంవత్సరములో 20,350 సంఘాలకు 1228.71 కోట్ల రూపాయల లక్ష్యం కాగా 16,059 సంఘాలకు గాను 1320 కోట్ల 90 లక్షల రూపాయల ఋణాలు బ్యాంక్ లింకేజ్ ద్వారా అందించి (107.50%) ప్రగతి సాధించడం జరిగింది.

2025-26 సంవత్సరములో 19,969 సంఘాలకు గాను 1228 కోట్ల 50 లక్షల రూపాయల లక్ష్యం కాగ 11.08.2025 నాటికి 4,300 సంఘాలకు 357 కోట్ల 41 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.

2024-25 సంవత్సరములో 246 కోట్ల రూపాయలు లక్ష్యం కాగ 2,953 మహిళా సంఘాలలోని 7,386 మంది సభ్యులకు 63 కోట్ల 11 లక్షల రూపాయల స్త్రీనిధి బ్యాంక్ ఋణాలు ఇప్పించడం జరిగినది. రాష్ట్ర స్థాయిలో స్త్రీ నిధి ఋణాల మంజూరులో మరియు రికవరిలో మన జిల్లా మొదటి స్థానములో నిలవడం జరిగింది.

9. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా):జిల్లాలో 9,094 స్వయం సహాయక సంఘాలు కలవు వాటిలో 90,940 సభ్యులు కలరు. బ్యాంకు లింకేజి ద్వారా 2025-26 సంవత్సరమునకు 638 స్వయం సహాయక సంఘాలకు 72 కోట్ల 22 లక్షల రూపాయలు వడ్డీలేని ఋణములు ఇప్పించటం జరిగింది. పి.యం. స్వానిధి క్రింద నాలుగు మున్సిపాలిటీలలోని వీధి విక్రయదారులకు వివిధ బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 32,156 మందికి, రెండవ విడతలో 20 వేల రూపాయల చొప్పున 15,564 మందికి మూడవ విడతలో 50 వేల రూపాయల చొప్పున 4,923 మంది వీధి విక్రయదారులకు ఋణాలు ఇప్పించడం జరిగింది.

ఇందిరా మహిళా శక్తి పథకం: స్వయం సహాయ సంఘాల ద్వారా పలు రకాల సూక్ష్మ పరిశ్రమలు, వ్యాపారాలను ప్రోత్సహించి సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించడము, మహిళల సామాజిక భద్రతా కోణంలో సంఘాలను బలోపేతం చేయడం. సంఘాలలో ఉన్న మహిళా శక్తి సామర్థ్యాలను వెలికితీసి, వారి వ్యాపార లక్ష్యాలను చేరుకునేలా సహకరించి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా నడిపించే పథకమే “మహిళా శక్తి”.

జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 803 వ్యక్తిగత యూనిట్స్ కి గాను 17 కోట్ల 76 లక్షల రూపాయలు మరియు 82 గ్రూప్ యూనిట్స్ కి గాను 50 లక్షల 82 వేల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేయడం జరిగింది.10. జిల్లా పంచాయతీ శాఖ:జిల్లా యందలి 545 గ్రామ పంచాయతీలలో 2,727 మంది మల్టీపర్పస్ వర్కర్ల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి.

పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా, తడి మరియు పొడి చెత్తను వేరుగా సేకరిస్తూ డంపింగ్ యార్డులకు తరలించి తడి చెత్తను సేంద్రీయ ఎరువుగా ఉత్పత్తి చేసి, దానిని గ్రామములో నాటిన మొక్కలకు వినియోగించడం జరుగుచున్నది.

నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకము చేపట్టడము జరుగుతున్నది. అదే విధముగా వనమహోత్సవం కార్యక్రమములో భాగంగా గ్రామ పంచాయతీలలో నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజు నీరు అందించుచు మొక్కలను సంరక్షించడము జరుగుచున్నది.

11. వైద్య మరియు ఆరోగ్యశాఖ:27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యము అందించాలనే ఉద్దేశంతో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేద ప్రజలందరికి మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కేంద్ర – ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి ఆరోగ్య యోజన – రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు జరుగుతుంది.

ఈ పథకం క్రింద గతంలో ఉన్న ఒక కుటుంబానికి 5 లక్షల పరిమితిని 10 లక్షల వరకు పెంచడం జరిగింది మరియు గుర్తింపు పొందిన 15,214 మందికి సేవలు అందించడం జరిగింది.టి.బి. ముక్త్ భారత్ (క్షయ రహిత భారత్): ప్రస్తుతం జిల్లాలో కేవలము 1,211 క్షయ వ్యాధి గ్రస్తులు మాత్రమే చికిత్స పొందుతున్నారు.

పోషకాహారము అందించుటలో భాగంగా నెలకు 500 రూపాయల చొప్పున 8,523 మంది వ్యాధిగ్రస్తులకు ఇప్పటివరకు వరకు 2 కోట్ల 75 లక్షల 92 వేయిల రూపాయలు అందిoచటం జరిగింది. నవంబర్, 2024 నుండి ఇట్టి పారితోషికం 1,000 రూపాయలకి పెంచడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి చొరవతో జిల్లాలో ధాతలు మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇప్పటి వరకు 717 క్షయ వ్యాధి గ్రస్తులకు పోషణ కిట్ లను ఉచితముగా 6 నెలల వరకు అందచేయడం ప్రశంసనీయము.

జిల్లాలో OP మరియు IP సేవల ద్వారా 7,28,974 ఔట్ పేషంట్ లకు మరియు 6,404 ఇన్ పేషంట్ లకు చికిత్స అందించటం జరిగింది. జిల్లాలోని 7 బస్తి దవాఖానాలలో 49,921 రోగులకు చికిత్స అందించటం జరిగింది.

గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలు 55% ఉన్నవాటిని ప్రస్తుతం ప్రసవాలు 70% పైగా పెంచడానికి కృషి చేయడం జరుగుచున్నది. వ్యాధి నిరోధక టీకాలు పూర్తి స్థాయిలో 13,409 మందికి అందించారు.

జాతీయ ఆరోగ్య మిషన్, ఆసరా పెన్షన్, అసంక్రామిక వ్యాధులు (యన్.సి.డి), పాలియేటివ్ కేర్ సేవలు, RBSK కార్యక్రమం, TSACS, ఆరోగ్య శ్రీ సేవలు, OP సేవలు, జాతీయ మానసిక వ్యాధుల నివారణ కార్యక్రమం (NMHP), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC), ఆరోగ్య ఉప కేంద్రాలు, (102) మరియు (108) అంబులెన్స్ సేవలు మొదలగు పథకాల ద్వారా ప్రజలకు సేవలు అందించబడుచున్నవి మరియు సీజనల్ వ్యాధులను అరికట్టుటకు ప్రతి శుక్రవారము మరియు మంగళవారం డ్రై డే ను నిర్వహిస్తు, గృహ సందర్శన ద్వార జ్వర సర్వే ను, మరియు డెంగ్యూ పాసిటివ్ వచ్చిన గృహము చుట్టు యాంటీ లార్వాల్ స్ప్రే విస్త్రృతం చేయడం జరుగుతున్నది.

12. మహిళా, శిశు, వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ:జిల్లాలో 5 సమగ్ర శిశు అభివృద్ధి సేవ ప్రాజెక్టులలో 1,501 మెయిన్ అంగన్వాడి కేంద్రములు కలవు. అందులో 74,252 మంది పిల్లలకు, 11,362 గర్భిణీలు మరియు 9,101 బాలింతలకు అనుబంధ పోషకాహారము, 3-6 సంవత్సరాల పిల్లలకు ఆట పాటల ద్వారా పూర్వ ప్రాథమిక విద్య అందించబడుచున్నది.

జిల్లాలో ఆరోగ్యలక్ష్మి పథకం, పోషణ అభియాన్ పథకము ద్వారా వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు, సలహాలు సంప్రదింపులు, పోషణ మరియు ఆరోగ్య, విద్య మొదలగు సేవలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించబడుచున్నవి. జిల్లాలో 36 మంది బాలికలతో ఒక బాలసదనము నడుపబడుచున్నది.జిల్లాలో శిశు గృహ ద్వారా 0-5 సంవత్సరాల లోపు గల వదిలి వేసిన పిల్లలకు రక్షణ కల్పిస్తూ వారికి ఆహార, వైద్య మొదలగు సదుపాయాలు కల్పించబడుచున్నవి.

ప్రస్తుతం శిశు గృహాలలో 23 మంది పిల్లలు ఉన్నారు.జిల్లాలోని దివ్యాంగుల అభ్యున్నతి కొరకై “వికలాంగుల, వయో వృద్దుల మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సంక్షేమ శాఖ” కార్యాలయము ద్వారా ఈ క్రింది పథకములు నిర్వహించబడుచున్నవి.

అందులో భాగంగా 2024-25 ఆర్ధిక సంవత్సరమునందు ఆర్ధిక పునరావాసం మరియు స్వయం ఉపాధి నిమిత్తం 17 లక్షల రూపాయలతో 35 మంది వికలాంగులకు సబ్సిడీ మరియు వికలాంగులను సహృదయముతో వివాహ మాడినటువంటి సకలాంగులకు ఒక్కొకరికి ఒక లక్ష రూపాయల చొప్పున మొత్తము 14 లక్షల రూపాయలతో 14 మందికి వివాహ ప్రోత్సాహక బహుమతి మంజూరు చేయడం జరిగింది.

ట్రాన్స్ జెండర్స్ ల సంక్షేమానికై ఇప్పటి వరకు 27 మంది ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను జారీచేయబడినవి. ట్రాన్స్ జెండర్లు వారి జీవనోపాదికై స్వయం ఉపాధి నిమిత్తం నెలకొల్పే వివిధ రకములైన వ్యాపారములు నిర్వహించుటకు 2023-24 ఆర్ధిక సంవత్సరము నందు నాన్ బ్యాంకు లింకేజీ పథకము క్రింద పూర్తి 100% సబ్సిడీ (50,000/- రూపాయలకు మించకుండా) 2.50 లక్షల రూపాయలతో 5 మంది ట్రాన్స్ జెండర్లకు సబ్సిడీ మంజూరు చేయడమైనది.

13. విద్యా శాఖ:జిల్లాలో 1,156 పాఠశాలల్లో 90,359 విద్యార్థినీ విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించబడుతుంది.2024-25 విద్యా సంవత్సరంనకు జిల్లాలోని పాఠశాలలకు 6,89,030 పాఠ్య పుస్తకాలను పాఠశాలకు పంపిణీ చేయడం జరిగింది.అమ్మ ఆదర్శ పాఠశాల: 760 పాఠశాలల్లో అత్యవసర మరమ్మత్తు పనులు మంజూరు చేయబడ్డాయి.

వీటిలో 598 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి మరియు 162 పాఠశాలల్లో పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ పధకానికి ఇప్పటి వరకు 22 కోట్ల 19 లక్షల 73 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.కస్తూర్భా గాందీ బాలికల విద్యాలయాలు (KGBVs): KGBV లలో 7,913 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2024-25 సంవత్సరం నకు గాను నూతనముగా 2 KGBV పాఠశాలలను మంజూరు చేయబడినవి, ఈ విద్యా సంవత్సరంలో ధర్పల్లి, ఇందల్వాయి, మెండోర, రుద్రూర్ మరియు ముగుపాల్ కెజిబివిలలో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టడం జరిగినది.పదవ తరగతి పరీక్షల ఫలితాలుజిల్లాలో 2024-25 పదవ తరగతి పరీక్షలలో 96.62% ఉత్తీర్ణత సాదించడమైనది.

జిల్లాలో ZPHS డొంకేశ్వర్ పాఠశాల విద్యార్థి అత్యధిక మార్కులు 586 సాధించి రాష్ట్రములోనే మొదటి స్థానములో నిలిచింది. ఇందులో భాగముగా జిల్లాలో 150 ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాదించడమైనది.

14. షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ:2025-26 సంవత్సరములో జిల్లాలోని 32 సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహములలో 2,398 మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి గృహములలో ప్రవేశము కల్పించనైనది.

ఈ సంవత్సరములో బెస్టు అవలబుల్ స్కూల్స్ స్కీమ్ క్రింద 6 పాఠశాలలో చదువుచున్న 203 మంది యస్.సి. విద్యార్థినీ, విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వడము జరిగింది. ఈ సంవత్సరములో కులాంతర వివాహములు చేసుకున్నా 4 జంటలకు 10 లక్షల రూపాయల ఆర్థిక ప్రోత్సాహకము మంజూరు చేయడము జరిగింది.పోస్ట్-మెట్రిక్ మరియు ప్రి-మెట్రిక్ స్కాలర్ షిప్స్: 2025-26 సంవత్సరములో 3,980 మంది విద్యార్థినీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనములు మరియు ఫీజులకు గాను 67.35 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.

మరియు ప్రి మెట్రిక్ స్కాలర్ షిప్స్ క్రింద 23 మంది విద్యార్థినీ విద్యార్థులకు 69 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.

15. జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ది సంస్థ:షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమములో భాగముగా NAC సంస్థ ద్వారా జిల్లా కేంద్రంలో 30 మంది మహిళలకు 3 నెలలు టైలరింగ్ లో శిక్షణ కొరకు ప్రతిపాదనలు ప్రధాన కార్యాలయము హైదరాబాద్ గారికి పంపనైనది.

వీరికి శిక్షణ అనంతరము ఒక్కొ కుట్టు మిషన్ ఉచితముగా సరఫరా చేయడము జరుగును.

16. జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ:జిల్లాలో మొత్తము షెడ్యూల్డు తెగల జనాభా 1,07,035 కలదు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 10 విద్యా సంస్థలు మరియు వసతి గృహాలు నిర్వహించబడుచున్నవి. 2025-26 సంవత్సరములో వసతి గృహ విద్యార్థుల నిర్వహణ కొరకు 1 కోటి 7 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది.

దీని వలన 1,510 మంది వసతి గృహ మరియు కళాశాల విద్యార్థినీ విద్యార్థులు లబ్దిపొందినారు.పోస్ట్ మెట్రిక్ మరియు ప్రి మెట్రిక్ ఉపకార వేతనములు:2025-26 సంవత్సరములో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనము క్రింద 1 కోటి 9 లక్షల రూపాయలు విడుదల కాగా 2023-24 సంవత్సరములోని పెండింగ్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనములు 1 కోటి 8 లక్షల రూపాయలు ఖర్చు చేయడమైనది.

దీని వలన 2,557 విద్యార్థినీ విద్యార్థులు లబ్ది పొందినారు.ఈ సంవత్సరములో బెస్ట్ అవలేబుల్ స్కూల్ స్కీం క్రింద 3వ, 5వ మరియు 8వ తరగతులలో 29 మందిని ఎంపిక చేయడం జరిగింది మరియు పూర్వపు విద్యార్థులు కలిపి మొత్తము 213 విద్యార్థినీ విద్యార్థులు అందుకు గాను 2 కోట్ల 99 లక్షల రూపాయలు మంజూరు అయినవి.

17. వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ:జిల్లాలో వెనుకబడిన తరగతుల విద్యార్థులు విద్యాభ్యాసము చేయుటకు బాలురకు మరియు బాలికలకు వేర్వేరుగా ప్రిమెట్రిక్ విద్యార్థులకు మొత్తము 34 వసతి గృహములు నడుపబడుచున్నవి. 2025-26 ఆర్థిక సంవత్సరములో బిసి ప్రి మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ వసతి గృహముల నిర్వహణ కొరకై వివిధ పద్దుల క్రింద నేటి వరకు 7 కోట్ల 22 లక్షల రూపాయలు విడుదలకాగా 6 కోట్ల 59 లక్షల రూపాయలు ఖర్చు చేయబడినవి.కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ప్రవేశముః- 2025-26 ఆర్థిక సంవత్సరములో ప్రభుత్వ వసతి గృహములు / ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలు / రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యనభ్యసించి అత్యంత ప్రతిభ కనబరిచిన బి.సి, ఇ.బి.సి లలోని 18 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 35 వేల రూపాయల చొప్పున ఉపకార వేతనము మంజూరు చేస్తూ వారికి కార్పొరేట్ కళశాలలో ప్రవేశము కల్పించబడినది.

బి.సి స్డడీ సర్కీల్ ద్వారా ఉద్యోగార్థులకు శిక్షణా తరగతులుః- 2025-26 ఆర్థిక సంవత్సరములో 100 మంది అభ్యర్థులకు గ్రూప్-1,2,3,4, SSC, RRB మరియు బ్యాంకింగ్ కి ఈ నెల 25వ తేది నుండి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించబడును.18

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments