నిజామాబాద్ రూరల్ ఎమ్మెలే భూపతిరెడ్డి పీఏ శ్రీనివాస్ రెడ్డి, డీఈవో అశోక్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ పీఏగా పనిచేయటాన్ని తప్పుపట్టిన కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.
విద్యాహక్కు చట్టం నిబంధనలను అతిక్రమిస్తున్నారని ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నోటీసులపై స్పందించిన డీఈవో అశోక్ శ్రీనివాస్ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామనీ పేర్కొన్నారు.
ప్రభుత్వ టీచర్లుగా ఉన్నవారు ప్రజాప్రతినిధులకు పీఏలుగా పనిచేయరాదనీ కోర్టు గతంలోనే స్పష్టం చేసింది.
