ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.
మాక్లూర్ మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన మోతే గంగుబాయి (85). చాకలి వృత్తి రిత్యా దొబి ఘాట్ వద్ద బట్టలు ఉతుకుతుంది.అనంతరం కాళ్ళు,చేతులు శుభ్రం చేసివడానికి చెరువులోకి వెళ్ళగా ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లతయింది.
స్థానికులు గాలించి మృతదేహాన్ని వెతికి తీసి పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
