డిచ్పల్లి మండలంలోని ఎన్హెచ్-44పై ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వైపు బైక్పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొంది.
ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన బైక్ యజమాని అజయ్ గోపు అని సమాచారం. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
