నగరంలోని వివాహిత ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన ఆరవ టౌన్ పరిధిలోని సారంగపూర్ లో చోటు చేసుకుంది. సోని (21) అనే వివాహిత శుక్రవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఎస్సై సందీప్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే వివాహిత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
