HomeCRIMEనిజామాబాద్‌ కమిషనరేట్‌లో పోలీసుల బదిలీలు...హెచ్‌సీలు, కానిస్టేబుళ్లకు వివిధ స్టేషన్లలో పోస్టింగ్‌లు

నిజామాబాద్‌ కమిషనరేట్‌లో పోలీసుల బదిలీలు…హెచ్‌సీలు, కానిస్టేబుళ్లకు వివిధ స్టేషన్లలో పోస్టింగ్‌లు

నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పలువురు హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు స్థానచలనం కల్పించారు. ఈ మేరకు పోలీసు కమిషనర్‌ సాయి చైతన్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్‌, జగిత్యాల జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన హెడ్‌ కానిస్టేబుళ్లకు వివిధ పోలీస్‌స్టేషన్లలో పోస్టింగ్‌లు కేటాయించడంతోపాటు.. కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న కొందరు కానిస్టేబుళ్లను వారి అభ్యర్థన మేరకు బదిలీ చేశారు.


హెచ్‌సీలకు కొత్త స్థానాలు: ఎం.డి. ఖాలిద్‌కు ట్రాఫిక్‌ పీఎస్‌, డి. గౌరీశంకర్‌కు సీసీఆర్బీ నిజామాబాద్‌, బి. ధూప్‌సింగ్‌కు ఇందల్వాయి, ఇ. శశిప్రసాద్‌కు టౌన్‌-1 పీఎస్‌ కేటాయించారు. డి. శ్రావణ్‌కు నందిపేట్‌, ఎన్‌. ప్రసాద్‌కు బోధన్‌ టౌన్‌, నవీన్‌కుమార్‌కు నవీపేట్‌, ఎస్‌. నాగరాజుకు వర్ని, బి. శివకుమార్‌గౌడ్‌కు రెంజల్‌ పీఎస్‌లలో పోస్టింగ్‌ ఇచ్చారు. కే. ఆనంద్‌, వి. సతీశ్‌ల నుంచి నివేదికలు రావాల్సి ఉంది.


కానిస్టేబుళ్ల బదిలీ: రుద్రూర్‌లో పనిచేస్తున్న పి. గంగాధర్‌ను నిజామాబాద్‌ రూరల్‌కు, వర్నిలోని అల్లకొండ శ్రీనివాస్‌ను కమ్మర్‌పల్లికి, టౌన్‌-5లోని కె. గోపీనాథ్‌ను వర్నికి, టౌన్‌-3లోని వి. రామారావును జాకన్‌పల్లికి, బాల్కొండలోని కె. అనిల్‌ను బోధన్‌ రూరల్‌ పీఎస్‌కు బదిలీ చేశారు. టౌన్‌-5లో పనిచేస్తున్న పి.సి. టి. సాయన్నను కూడా ఆయన అభ్యర్థన మేరకు రెంజల్‌ పీఎస్‌కు బదిలీ చేశారు.

బదిలీ అయిన సిబ్బంది తక్షణమే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని సీపీ ఆదేశించారు. సంబంధిత అధికారులు సిబ్బందిని వెంటనే రిలీవ్‌ చేసి, వారు విధుల్లో చేరిన తేదీలను కమిషనరేట్‌ కార్యాలయానికి నివేదించాలని సూచించారు. అభ్యర్థన మేరకు జరిగిన బదిలీలకు జాయినింగ్‌ సమయం, టీటీఏ వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments