ఎల్లారెడ్డి.
మండలంలోని అన్నసాగర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నిజాంసాగర్ మండలం నర్వ గ్రామానికి చెందిన చిన్న అంజయ్య (46) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆదివారం రాత్రి అంజయ్య టీవీఎస్ ఎక్సెల్ పై బొగ్గుగుడిశా వైపు నుంచి స్వంత గ్రామం నర్వ కు వెళ్తుండగా బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డి కి వస్తున్న ఆర్టీసీ బస్సు అన్న సాగర్ గేటు వద్ద ఢీకొంది. దీంతో అంజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతునికి భార్య సాయవ్వతో పాటు కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు.
