ఒకే ఒక్కడు ….ఒకడి కాదు ……రెండు కాదు ….ఏకంగా 80 చోరీ లు చేసాడు. అరడజన్ కు పైగా చిక్కాడు ……పీడీ యాక్టు లో ఏడాది జైలు నిరంతర నీడలా పోలీసులు డేగ ల వెంటాడుతూనే ఉన్నాసరే అవేవి లెక్క చేయడు ఒక్కసారి చోరీ చేయడానికి పథకం వేసాడంటే క్షణాల్లో తాళం పగలాల్సిందే …..మరో వారం రోజుల్లో కూతరు పెండ్లి ఉంది ఆ ఖర్చులు తీరాలంటే అంతే రేంజ్ లో చోరీ కి ప్లాన్ చేసాడు.
కానీ అడ్డా మార్చేశాడు హైదారాబాద్ లో చేస్తే పోలీసులు ఇట్టే పెట్టేస్తున్నారు .అందుకే నిజామాబాద్ నగరం అయితే సులువుగా కొట్టేసి రావచ్చు అనుకున్నాడు. అంతే స్కూటీ వేసుకొని రయ్యున వచ్చేసాడు శివారు ప్రాంతంలో తాళం వేసి ఉన్న ఇండ్లనులక్ష్యంగా పెట్టుకున్నాడు.
రెప్ప పాటు కాలం లో తాళం పగల గొట్టడం ఇంట్లోకి దూరడం చేతికి అందినంత దోచుకొని వెళ్లి పోవడం కానీ ఈసారి నిజామాబాద్ పోలీసులు రెండే రోజుల్లో అట కట్టించారు శనివారం నిజామాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసిన సయ్యద్ హమీద్ నేర ప్రస్థానం !! ఇది .
వరంగల్ సొంత ఉరే అయినా బ్రతుకు దెరువుకోసం మొదలు పెట్టిన దొంగతనాలు చెయ్యడానికి హైదారాబాద్ అనువైన ప్రాంతం అనుకోని అక్కడే మకాం వేసాడు 2002 లో వివాహం చేసుకొని హైదారాబాద్ కి వచ్చి లేబర్ గా జీవనం గడిపే వారు. ఈ మేరకు ఎంత చేసిన పూట గడవకపోవడంతో 2015 లో తొలి సారిగా హైదరాబాద్ లో దొంగతనం చేశాడు.
ఇక అదే వృత్తిగా స్వీకరించి తరుచూ దొంగతనాలు చేశాడు. హమీద్ పై ఇప్పటి వరకు సుమారు 80కి పైగా కేసులు ఉన్నాయని తెలుస్తోంది. 2018 లో పీడీ యాక్టు కేసు లో జైలుకు పంపారు.
అయినా కూడా తన బుద్ధి మార్చుకోకుండా దొంగతనాలు చేశాడు. అతడు చోరీ చేసిన బంగారాన్ని కరిగించి విక్రయించి ఇంట్లో వాళ్లకు డబ్బులు అందజేస్తుంటాడు.
ఒకవేళ పోలీసులకు చిక్కితే బెయిల్‌పై బయటకు వచ్చేందుకు కొంత సొత్తును ముందే భద్రపరుస్తాడు. అరెస్ట్ అయిన వెంటనే ముందే పురమాయించిన లాయర్ సాయంతో బెయిల్‌పై బయటకు వచ్చి, ఎప్పటి మాదిరిగానే చోరీలు చేస్తుంటాడు.
ఇక హైదరాబాద్ ఏ కాకుండా పక్క జిల్లాలను కూడా ఎంచుకొని హైదరాబాద్ నుంచి మధ్యరాత్రి బయలుదేరి ఉదయం వరకు తాను అనుకున్న సమయానికి ఎంచుకున్న ప్రదేశానికి చేరుకుంటాడు.
ఇక ఏముంది తాళం వేసిన ఇల్లే టార్గెట్ పెట్టుకొని గోడలు దుంకి తన వెంట తెచ్చుకున్న ఒక సుత్తె, ఒక రాడ్డు, తో చాకచక్యంగా వ్యవహరించి తాళం పగల గొట్టి ఇంట్లొకి చొరబడుతాడు.
ఈ మేరకు ఈ నెల 6 వ తేదీన తన కూతురు వివాహం ఉంది. దీంతో కూతురు వివాహానికి బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు సంపాదించాలని దురుద్దేశం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు వచ్చాడు.
నిజామాబాద్ నగరంలోని జనవరి 26 న శివరాత్రి రోజున రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో బంగారం,నగదు చోరీకి గురైంది. అదే ఠాణా పరిధిలో తాళం వేసిన మరో ఇంట్లోనూ చోరీ జరిగింది.
తన కంటే ఒక్క అడుగు ముందుకు వేసి ఈ దొంగతలను సవాలుగా స్వీకరించి దీనిపై దృష్టి సారించిన నిజామాబాద్ పోలీసులు నిందితుడి కదలికలపై గట్టి నిఘా పెట్టారు. ఇక అతని కదలికలపై గట్టి నిఘా పెట్టిన ప్రతి సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్ వరకు వెళ్ళారు.
ఇక హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సహాయంతో ఎప్పటికప్పుడు అతని కదలికలు తెలుసుకొని పోలిసులు కేవలం రెండు రోజుల్లో పట్టుకొని రిమాండ్ తరలించారు.
