HomeCRIMEరౌడీ షీటర్లపై పోలీసుల నిఘా..చట్ల వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు సీఐ శ్రీనివాస్ రాజ్..పండగలను...

రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా..చట్ల వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు సీఐ శ్రీనివాస్ రాజ్..పండగలను దృష్ట రౌడీ షీటర్ల కు కౌన్సింగ్…

రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని, చట్ల వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాస్ రాజ్ హెచ్చరించారు.

గురువారం నగరంలోని రెండవ టౌన్ పరిధిలో రాబోయే పండగలను దృష్టిలో ఉంచుకుని రౌడీ షీటర్ల కు కౌన్సింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రాబోయే పండగలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు పునరావృతం కాకుండా, రౌడీ షీటర్లు అల్లర్లు, అలజడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

చెడు నడత కలిగిన రౌడీ షీటర్లపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు.

అలాగే పద్ధతి మార్చుకొని పక్షంలో సరైన నడవడిక లేనిపక్షంలో ఎక్కువ కేసులు ఉన్న వారి పైన పీడీ యాక్ట్ కూడా ప్రయోగించి జైలుకి పంపిస్తామని హెచ్చరించారు.

ఎవరైనా సత్ప్రవర్తన కలిగి ఉంటే అలాంటి వారి పట్ల మరియు వారి యొక్క షీట్ ని కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ కౌన్సిలింగ్ లో రెండవ టౌన్ ఎస్ఐ యాసిర్ అరఫాత్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments